"ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని…

"ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”

అన్’నవ్వాస్ ఇబ్న్ సిమ్’ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మం మరియు పాపం గురించి అడిగాను, వారు ఇలా జవాబిచ్చారు: "ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మము మరియు పాపమును గురించి ప్రశ్నించడం జరిగింది. ఆయన (స) ఇలా అన్నారు: ధర్మము యొక్క అతి గొప్ప లక్షణాలు: సత్శీలము కలిగి ఉండుట, తద్వారా అల్లాహ్ పట్ల దైవభీతి కలిగి ఉండుట; హాని, కీడు, మొదలైన వాటిని సహించడం ద్వారా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండుట; అతిగా ఆగ్రహానికి గురి కాకుండా ఉండుట; ఉల్లాసమైన ముఖం; దయగల మాటలు; బంధుత్వములను నిభాయించుట; విధేయత; నీతి, మంచి సహవాసం మరియు సాంగత్యము. ఇక పాపకార్యాల విషయానికి వస్తే, ఇది ఆత్మలో కదిలే మరియు ఊగిసలాడుతూ ఉండే అనుమానాస్పద విషయాలను సూచిస్తుంది, ఏ విషయం కారణంగా హృదయం ఎప్పుడూ తేలికగా ఉండదో; హృదయంలో ఎపుడూ అది సందేహాస్పదంగానే ఉంటుందో, అది పాపం అని హృదయం ఎప్పుడూ భయపడుతూ ఉంటుందో; మరియు ఆ విషయం యొక్క వికారత్వాన్ని బట్టి దానిని సమాజంలోని ఉన్నత వర్గాలకు, లేదా ఉత్తమమైన మరియు పరిపూర్ణమైన వ్యక్తులకు తెలియడాన్ని ఇష్టపడదో ఇది అటువంటి విషయం. ఇలా ఎందుకంటే ఆత్మకు తన మంచి లక్షణాలను ప్రజలకు చూపించాలనే సహజ కోరిక ఉంటుంది. కనుక తన కొన్ని చర్యలను, ఆచరణలను ప్రజలకు తెలియజేయడం, లేక వారికి తెలియడం ఆత్మ ఇష్టపడనప్పుడు అటువంటి చర్య, ఆచరణ పాపం అనబడుతుంది. అందులో ఎటువంటి మంచీ ఉండదు.

فوائد الحديث

ఈ హదీథులో మంచి నైతికతలను ప్రోత్సహించడం కనిపిస్తుంది; ఎందుకంటే మంచి నైతికత అనేది ధర్మము యొక్క గొప్ప లక్షణాలలో ఒకటి.

విశ్వాసి సత్యం మరియు అసత్యం గురించి గందరగోళంలో పడడు; బదులుగా, అతను తన హృదయంలోని వెలుగు ద్వారా సత్యాన్ని తెలుసుకుంటాడు మరియు అసత్యానికి దూరంగా ఉంటాడు మరియు దానిని తిరస్కరిస్తాడు.

పాపపు సంకేతాలలో ఆందోళన, హృదయంలో కలత, మరియు ప్రజలు దాని గురించి తెలుసుకోవడం పట్ల అయిష్టత ఉన్నాయి.

అల్ సింది (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది అనుమానాస్పద విషయాలలో ఉంది, దీనిలో ప్రజలకు ఒక విషయపు రెండు పార్శ్వముల నిర్దిష్ట లక్షణాల గురించి తెలిసి ఉండదు. అలా గాక షరియతులో – వ్యతిరేకంగా ఎటువంటి ఆధారమూలేని ఆఙ్ఞాపించబడిన విషయాలన్నీ ధర్మబద్ధమైనవే. అలాగే షరియతులో నిషేధించబడినది కూడా పాపమే. ఇటువంటి విషయాలలో (అంటే, ఆఙ్ఞాపించబడిన మరియు నిషేధించబడిన విషయాలలో) హృదయాన్ని సంప్రదించి దానికి భరోసా ఇవ్వవలసిన అవసరం లేదు.

హదీథులలో ప్రస్తావించబడిన వారు మంచి స్వభావం గల వ్యక్తులు; అంతేగానీ, కోరికల నుండి ఉత్పన్నమైన విషయాలు నింపబడిన హృదయాలు కలిగి ఉన్న వారు కాదు. అటువంటి హృదయాలు తలక్రిందులైన హృదయాలుగా ఉంటాయి. వారు మంచిని గుర్తించరు, చెడును ఖండించరు.

అల్-తయ్యిబి ఇలా అన్నారు: హదీథులో ధర్మబద్ధత వివిధ అర్థాలతో వివరించబడినది అని చెప్పబడింది. ఒక చోట దీనిని ఆత్మకు శాంతి ప్రదాయినిగా వివరించబడింది, మరియు హృదయం శాంతిని పొందే విషయంగా వివరించబడింది. మరొక చోట దీనిని విశ్వాసంగా, మరొక చోట ఒకరిని అల్లాహ్ కు దగ్గరగా తీసుకువచ్చే విషయంగా వివరించబడింది, అలాగే ఇక్కడ మంచి వ్యక్తిత్వంగా వివరించబడింది. మంచి వ్యక్తిత్వాన్ని – హానిని, కష్టాలను భరించడం, తక్కువ కోపం కలిగి ఉండడం, ఉల్లాసమైన ముఖం మరియు దయగల మాటలు అని వివరించబడింది. ఇవన్నీ అర్థంలో దగ్గరగా ఉన్న విషయాలే.

التصنيفات

సద్గుణాలు, హృదయాల ఆచరణలు