إعدادات العرض
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు. “ఇన్నల్ హంద లిల్లాహి, నస్తయీనుహు, వ నస్తఘ్’ఫిరుహు, వ నఊజుబిహి మిన్ షురూరి అన్’ఫుసినా, మయ్యహ్’దిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్’లిల్ ఫలా హాదియలహు, వ అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. {యాఅయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్, వ ఖలఖ మిన్’హా జౌజహా, వ బస్స మిన్’హుమా రిజాలన్ కసీరన్, వ నిసాఅన్, వత్తఖుల్లాహల్లజీ తసాఅలూనబిహి, వల్ అర్హామ్, ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా}[సూరహ్ అన్ నిసా:1]; {యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతు ఖాతిహి, వలా తమూతున్న ఇల్లా వ అన్’తుమ్ ముస్లిమూన్.} [సూరహ్ ఆలి ఇమ్రాన్:102]; {యా అయుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ, వఖూలూ ఖౌలన్ సదీదన్}; {“యుస్’లిహ్’లకుం ఆ’మాలకుం, వ యఘ్’ఫిర్’లకుం, జునూబకుం, వమన్’యుతిఇల్లాహ వ రస్సులహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా} [అల్ అహ్’జాబ్ 70, 71] (నిశ్చయంగా సకలస్తోత్రములూ, మరియు ప్రశంసలన్నియూ కేవలం అల్లాహ్ కొరకే, మేము అయనను మాత్రమే సహాయం కొరకు వేడుకుంటాము, మరియు మమ్ములను క్షమించమని ఆయను మాత్రమే వేడుకుంటాము, మాలోని కీడు నుండి ఆయన రక్షణ కోరుకుంటాము, ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడో, అతడిని ఎవరూ మార్గభ్రష్ఠుడిని చేయలేరు, మరియు ఎవరినైతే ఆయన మార్గభ్రష్ఠత్వములో వదిలివేసినాడో, ఎవరూ అతనికి సన్మార్గ దర్శకం చేయలేరు. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవరూ లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడని మరియు ఆయన సందేశహరుడనీ నేను సాక్ష్యమిస్తున్నాను. {ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా (పేరుతో) నైతే మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు} [సూరతున్’నిసా 4:1]; { ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి} [సూరతుల్ ఆలి ఇమ్రాన్ 3:102]; {ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి; ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు} [సూరతుల్ అహ్’జాబ్ 30:70,71]
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو हिन्दी 中文 বাংলা Español Kurdî Português മലയാളം Kiswahili தமிழ் සිංහල မြန်မာ ไทย 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština ગુજરાતી አማርኛ Yorùbá Nederlands ئۇيغۇرچە Hausa دری Magyar Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy Kinyarwanda नेपाली Română Српски Soomaali Deutsch Moore Українська Български Tagalog Wolof Azərbaycan ქართული тоҷикӣالشرح
ఇందులో అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు) – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారని తెలియజేస్తున్నారు. “ఖుత్బతుల్ హాజహ్” అంటే “అవసర సమయపు ప్రసంగం” అని తెలుగులో అనువదించవచ్చు. సాధారణంగా ఏదైనా అవసరానికి సంబంధించి ప్రసంగం ఇవ్వబడే సమయములో, ప్రధాన ప్రసంగానికి ముందు ఈ ‘ఖుత్బతుల్ హాజహ్’ ప్రసంగం చదువబడుతుంది. తరువాత ప్రధాన ప్రసంగం మొదలవుతుంది. ఉదాహరణకు వివాహ సమయమున ఇవ్వబడే ప్రసంగం, శుక్రవారం నాడు ‘జుమా ఖుత్బా’ ప్రారంభానికి ముందు. ఈ ఖుత్బతుల్ హాజహ్ చాలా గొప్ప అర్థాలు కలిగి ఉంది. ఉదాహరణకు సకలస్తోత్రములు మరియు సమస్తమైన ప్రశంసలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకము అనుట, కేవలం ఆయన నుండి మాత్రమే సహాయం కోరుకొనుట, పాపములకు క్షమాభిక్ష కొరకు కేవలం ఆయనను మాత్రమే వేడుకొనుట, మరియు పాపముల నుండి దూరంగా ఉండుట కొరకు ఆయన సహాయం కోరుట, మనలోని కీడులనుండి, మరియు ఇతర కీడుల నుండి ఆయన రక్షణ కోరుకొనుట మొదలైనవన్నీ. అలాగే ఇందులో సన్మార్గదర్శకం కేవలం అల్లాహ్ నుండి మాత్రమే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడు, అతడిని ఎవరూ మార్గభ్రష్టుడిని చేయలేరు. అలాగే ఎవరినైతే అల్లాహ్ అపమార్గములో వదలివేసినాడొ, అతడిని ఎవరూ సన్మార్గానికి తీసుకు రాలేరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘తౌహీదు’ యొక్క సాక్ష్యమును – అంటే ‘అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని సాక్ష్యమిచ్చుటను – ప్రస్తావించినారు, అలాగే ‘రిసాలహ్ యొక్క సాక్ష్యమును’ – అంటే ‘ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుటను – ప్రస్తావించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బతుల్ హాజహ్ ను మూడు ఖుర్’ఆన్ ఆయతులను పఠించి ముగుంచినారు. ఆ ఆయతులలో అల్లాహ్ ఆదేశించిన పనులను, కేవలం ఆయన సామీప్యము, ఆయన సాన్నిధ్యము, కరుణ కొరకు మాత్రమే ఆచరించాలని, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండాలని, ఆ విధంగా అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (భయభక్తులు) కలిగి ఉండాలని – ఎవరైతే అలా చేస్తారో వారి ఆచరణలు, వారి మాటలు సరియైనవిగా, న్యాయ బధ్ధమైనవిగా ఉంటాయి. వారి పాపాలు క్షమించబడతాయి, వారికి ఈ ప్రపంచములో మంచి జీవితం ప్రసాదించబడుతుంది, మరియు పరలోకములో విజయులై స్వర్గములో ప్రవేశింపజేయబడతారు.فوائد الحديث
ఏదైనా ప్రసంగాన్ని, ఉదాహరణకు శుక్రవారపు ప్రసంగము, వివాహ ప్రసంగము మొదలైన వాటిని – ఈ ఖుత్బతుల్ హాజహ్ ప్రసంగముతో ప్రారంభించుట అభిలషణీయమ.
ఖుత్బహ్ ప్రసంగము అల్లాహ్ ను స్తుతించు వాక్యములతో, ఆయన ప్రశంసలతో, ఆయన స్తోత్రములతో, షహాదహ్ (సాక్ష్యపు) వాక్యాలతో మరియు కొన్ని ఖుర్’ఆన్ ఆయతులతో కూడినదై ఉండాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు, తమ ధర్మములో ఏ ఏ విషయాలు అవసరమో వాటినన్నింటినీ బోధించినారు.
التصنيفات
నికాహ్ ఆదేశాలు మరియు షరతులు