“ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టితాలన్నింటి భవితవ్యాన్ని…

“ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టితాలన్నింటి భవితవ్యాన్ని రాసి ఉంచినాడు

అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టితాలన్నింటి భవితవ్యాన్ని రాసి ఉంచినాడు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “ఆయన సింహాసనం నీటిపై ఉన్నది”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సృష్ఠితాల భవితవ్యానికి సంబంధించి ఏమి జరుగనున్నది అనేది అల్లాహ్ చాలా విపులంగా రాసాడు; ఉదాహరణకు వాటి జీవిత కాలాన్ని గురించి, వాటి మరణాన్ని గురించి, వాటి ఉపాధి గురించి – ఇలా అనేక విషయాలను గురించి, ఈ ఆకాశాలు, మరియు భూమిని ఆయన సృష్టించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే చాలా వివరంగా రాసి, ‘లౌహ్ అల్ మహ్’ఫూజ్’ లో (భద్రపరుచబడిన ఫలకములో) భద్ర పరిచాడు. ప్రతి విషయమూ ఆయన ఆదేశించిన విధంగానే జరుగుతుంది. ప్రతి విషయము, ప్రతి వస్తువు మొదలైన ప్రతి దాని యొక్క ఉనికి, భవితవ్యము అల్లాహ్ ఇచ్ఛానుసారమే ఉంటుంది. దాసునిపై వచ్చి పడేది ఏదీ అతనిని చేరకుండా ఉండదు, అతనిది కానిది ఏదీ అతనిని ఎన్నటికీ చేరదు.

فوائد الحديث

ఇందులో పూర్వనిర్ధిష్ఠాన్ని, మరియు భవితవ్యాన్ని ముందుగానే లిఖించబడి ఉండడాన్ని విశ్వసించుట తప్పనిసరి విధి అనే విషయం తెలుస్తున్నది.

విధివ్రాత అంటే: అది, విషయాలు సృష్టించబడక పూర్వమే వాటి గురించి అల్లహ్ యొక్క ఙ్ఞానము; ఆయన ఇచ్ఛ, మరియు వాటిని ఆయన సృష్టించుట మొదలైనవి అన్నీ.

ఈ భూమీ మరియు ఆకాశాలు సృష్టించబడక పూర్వమే ప్రతి విషయాన్ని గురించి చాలా వివరంగా వ్రాయబడి ఉంది అని (విధివ్రాతను) విశ్వసించడం, మనిషిలో ఒక రకమైన సంతృప్తిని, అల్లాహ్ పట్ల విధేయతను పెంపొందిస్తుంది.

భూమ్యాకాశాల సృష్టికి ముందే అనంత కరుణామయుడైన అల్లాహ్ యొక్క సింహాసనం నీటి పైన ఉన్నది.

التصنيفات

తీర్పు,విధి వ్రాత యొక్క దశలు