“మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును…

“మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి కడుపులో అసౌకర్యంగా ఉండి, ఒకవేళ కడుపు నుండి గాలి లాంటిది ఏదైనా బయటకు వెలువడిందేమో అనే సందేహానికి గురైతే – అతడు తిరిగి ఉదూ చేయుటకుగాను చేస్తున్న సలాహ్’ ఆపరాదు – ఉదూను భగ్నం చేసే పని జరిగిందని అతనికి నిర్ధారణ అయితే తప్ప; అది గాలి విడుదలైన శబ్దం వినడం గానీ లేక ఆ దుర్వాసనను గమనించడం గానీ. ఎందుకంటే ఒక నిర్దిష్ట విషయము సందేహాస్పదమైన విషయము ద్వారా రద్దు చేయబడదు. ఇందులో అతడు ఉదూ చేసి ఉన్నాడు అనేది నిర్దిష్ఠమైన విషయం, ఉదూను భగ్నం చేసే వాయువు (హదస్) వెలువడింది అనేది సందేహాస్పదమైన విషయం.

فوائد الحديث

ఈ హదీసు ఇస్లాం యొక్క పునాది విషయాలలో ఒకటి మరియు ఇస్లామీయ న్యాయశాస్త్రము యొక్క మూల సూత్రాలలో ఒకటి, అది: “సందేహము ద్వారా నిర్ధిష్ఠత రద్దు చేయబడదు”. ఇందులో న్యాయ సూత్రము ఏమిటంటే “ఏ విషమైనా తాను ఉన్న స్థితిలోనే ఉంటుంది, దానికి భిన్నంగా నిరూపణ కానంతవరకు.”

సందేహము పరిశుద్ధతను ప్రభావితం చేయలేదు. సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి పరిశుద్ధ స్థితిలోనే (ఉదూ చేసిన స్థితిలోనే) ఉంటాడు – దానికి భిన్నమైనది నిర్థారణగా నిరూపించబడనంత వరకు.

التصنيفات

సిద్ధాంతపరమైన మరియు ఛాందసవాద నియమాలు, వజూను భంగపరిచేవి