“ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను…

“ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు. {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14] (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14):”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైనా విధిగా ఆచరించవలసిన నమాజులలో ఏదైనా నమాజును దాని సమయం దాటిపోయేంత వరకు ఆచరించుట మరిచిపోతే, అతడు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును (ఖజా నమాజుగా) ఆచరించుటకు ఉపక్రమించాలి. ఆ విధంగా పూర్తి చేయకుండా మిగిలి పోయిన నమాజును గుర్తుకు వచ్చిన వెంటనే ఆచరించుట తప్ప, ఒక ముస్లిము ఆ నమాజును సమయం మించిపోయేంత వరకు మరిచిపోవటం (అలక్ష్యము) వలన జరిగిన పాపము అతని నుండి తొలగిపోవుట, లేదా కప్పివేయబడుట జరుగదు. అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఇలా ఆదేశించినాడు: {… وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكْرِىٓ} (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14): అంటే, విధిగా ఆచరించవలసిన నమాజులలో దేనినైనా ఆచరించుట మరిచిపోతే, గుర్తుకు వచ్చిన వెంటనే అల్లాహ్ ను స్మరించుటకొరకు ఆ నమాజు స్థాపించుట కూడా విధి అని అర్థము.

فوائد الحديث

ఈ హదీసులో సలాహ్ (నమాజు) యొక్క ప్రాధాన్యత గురించి తెలుస్తున్నది. అలాగే నమాజు ఆచరించుట పట్ల అలసత్వం ప్రదర్శించి, సమయం గడిచిపోయిన పిదప దానిని ఆచరించి ఎలాగోలా పూర్తిచేసుకొనుట ఎంతమాత్రమూ తగదు అనే విషయాలు తెలుస్తున్నాయి.

ఏ సముచిత కారణమూ లేకుండా విధిగా ఆచరించవలసిన ఏ నమాజునైనా ఉద్దేశ్యపూర్వకంగా దాని నిర్ధారిత సమయం గడిచిపోయేంత వరకు ఆలస్యం చేయుటకు (షరియత్’లో) అనుమతి లేదు.

విధిగా ఆచరించవలసిన నమాజును మరిచిపోయిన వారెవరైనా గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును పూర్తి చేయాలి, అలాగే గాఢనిద్ర వలన పూర్తి చేయలేక పోయిన నమాజును అతడు నిద్ర నుంచి లేచిన వెంటనే పూర్తి చేయాలి.

(దినములో) ఆచరించకుండా ఉండిపోయిన నమాజులను వెంటనే ఆచరించుట విధి.

التصنيفات

నమాజ్ యొక్క అనివార్యమవటం మరియు దాన్ని వదిలే వాడి ఆదేశము, నమాజ్ చదివే వారి తప్పిదాలు