“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’…

“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”

అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

సహచర ముస్లింలు ఎవరి నాలుక నుండి అయితే సురక్షితంగా ఉంటారో, అతడే నిజమైన మరియు పరిపూర్ణమైన ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో తెలియజేస్తున్నారు. అతను వారిని అవమానించడు, తిట్టడు లేదా వెన్నుపోటు పొడవడు మరియు తన నాలుకతో వారిని బాధించడు. అలాగే సహచర ముస్లిములు అతని చేతి నుండి కూడా సురక్షితంగా ఉంటారు – అంటే అతడు వారిపై దాడి చేయడు, వారి సంపదలను అన్యాయంగా, అధర్మంగా కబళించడు; లేక ఆవిధమైన ఏ పనీ చేయడు. అలాగే ‘ముహాజిరు’ అంటే అల్లాహ్ నిషేధించిన వాటన్నింటినీ వదలివేసే వాడు.

فوائد الحديث

భౌతికంగా లేదా నైతికంగా ఇతరులకు హాని కలిగించకుండా ఉండటం ద్వారా మాత్రమే ఇస్లాం యొక్క పరిపూర్ణత సాధించబడుతుంది.

ఈ హదీసులో నాలుక మరియు చేయి ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి - వాటి వల్ల జరిగే అనేక తప్పులు మరియు హాని కారణంగా. చాలా చెడులు వాటి నుంచే వస్తాయి.

ఇందులో చెడును వదలివేయాలనే, మరియు అల్లాహ్ ఆదేశాలను శిరసావహించాలనే హితబోధ ఉన్నది.

అల్లాహ్ యొక్క హక్కులను మరియు తోటి ముస్లిముల యొక్క హక్కులను ఎవరైతే నెరవేరుస్తారో వారే ఉత్తములైన ముస్లిములు.

‘దాడి చేయుట’ అనేది మాటల ద్వారా లేక చేతల ద్వారా – ఏదైనా కావచ్చు.

‘హిజ్రత్’ (వలస పోవుట) అంటే అల్లాహ్ నిషేధించిన వాటి నుండి సంపూర్ణంగా వలస పోవుట, అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన దానిని విడిచిపెట్టడమే పరిపూర్ణ వలస.

التصنيفات

విశ్వాసం పెరుగుదల మరియు దాని తరుగుదల, సద్గుణాలు, మాట్లాడే మరియు మౌనంగా ఉండే పద్దతులు