“ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”

“ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని అబీ మూసా అల్ అష్అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ముస్లిములను భయపెట్టడానికి లేదా వారిని దోచుకోవడానికి, వారికి నష్టం కలిగించడానికి ఎవరైతే ఆయుధాలను ఎత్తుతారో వారికి వ్యతిరేకంగా ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిస్తున్నారు. అన్యాయంగా, అధర్మంగా ఎవరైతే అటువంటి పనికి పాల్బడుతారో అటువంటి వాడు ఘోరాతి ఘోరమైన పాపం చేసినవాడు అవుతాడు. అటువంటి వాడు ఈ కఠినమైన హెచ్చరికకు పాత్రుడవుతాడు.

فوائد الحديث

ఇందులో తోటి ముస్లిముపై ఆయుధాలను ఎత్తే ముస్లిమునకు వ్యతిరేకంగా కఠినమైన హెచ్చరిక ఉన్నది.

ఈ భూమిపై అత్యంత హేయమైన పని ముస్లిములపై తోటి ముస్లిం ఆయుధాలను ఎత్తడం, అరాచకాన్ని ప్రబలింప జేయడం, మరియు వారిని చంపడం.

ఈ హదీసులో పేర్కొనబడిన హెచ్చరిక నిజానికి తోటి ముస్లిములపై ఆయుధాలను ఎత్తడం మాత్రమే కాక, ముస్లిములలో ఉండే చెడ్డవారు, అరాచకానికి పాల్బడేవారు, అన్యానికి, అవినీతికి పాల్బడేవారు – ఈ అందరికీ వర్తిస్తుంది.

సరదాకైనా తోటి ముస్లిములను ఆయుధాలతో బెదిరించడం, మరింకే విధంగానైనా వారికి కష్టం కలిగించడం ఇస్లాంలో నిషేధించబడినది.

التصنيفات

విధేయత నుండి వైదొలగటం (ఫిస్క్), బందిపోటు దోపిడి శిక్ష