“ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.”

“ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.”

అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూల్లల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘బర్దైన్’ నమాజులను ఆచరించుటకు ఆశపడాలని, ఆసక్తి కలిగి ఉండాలని హితబోధ చేస్తున్నారు. ‘బర్దైన్’ నమాజులు అంటే ‘ఫజ్ర్’ మరియు ‘అస్ర్’ నమాజులు. ఎవరైతే ఆ నమాజులను వాటి హక్కును చెల్లిస్తూ, వాటి నిర్ధారిత సమయాలలో, మస్జిదులో జమా’అత్ తో పాటు ఆచరించడం మొదలైన విషయాలను పాటిస్తూ ఆచరిస్తాడో, అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను ఇస్తున్నారు – ఆ నమాజులు అతడు స్వర్గములో ప్రవేశించడానికి ఒక కారణము కాగలవు.

فوائد الحديث

ఇందులో ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులను సంరక్షించుట (వాటిని క్రమం తప్పకుండా ఆచరించుట) యొక్క ఘనత తెలియుచున్నది. ఎందుకంటే ఫజ్ర్ నమాజు సమయములో సుఖనిద్ర యొక్క సౌఖ్యం ఉన్నది; మరియు అస్ర్ నమాజు సమయము అది అతడు తన పనులలో, వ్యాపారము మొదలైన వాటిలో నిమగ్నుడై ఉండే సమయం. కనుక ఎవరైతే ఈ రెండు నమాజులను సంరక్షించుకుంటాడో, అతడు మిగతా నమాజులను కూడా తేలికగా సంరక్షించుకుంటాడు.

ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులను ‘బర్దైన్ నమాజులు’ అని పిలవడం జరిగింది. అంటే ‘చల్లని నమాజులు’ అని అర్థము. ఎందుకంటే ఫజ్ర్ నమాజు రాత్రి యొక్క చల్లదనాన్ని కలిగి ఉంటుంది, అలాగే అస్ర్ నమాజు పగటి సమయం యొక్క చల్లదనాన్ని కలిగి ఉంటుంది, అయితే అస్ర్ నమాజు సమయములో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, అది దానికి ముందు ఉన్న స్థితితో పోలిస్తే చల్లగా ఉంటుంది. లేదా వాటికి ‘బర్దైన్’ అనే పేరు, ఆ రెంటినీ ప్రత్యేకించడానికి పెట్టి ఉండవచ్చు, ఎలాగైతే “అల్’ఖమరైన్” (రెండు చంద్రుళ్ళు) అనే పేరు సూర్యునికీ మరియు చంద్రునికీ కలిపి ఇవ్వబడినదో.

التصنيفات

నమాజు ప్రాముఖ్యత