“సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా…

“సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”

అబూ అల్ హవ్’రా అస్-స’దీ ఇలా పలికినారు: “హసన్ ఇబ్న్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హుమా) ను నేను ఇలా అడిగాను: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నీవు ఏమి కంఠస్థము చేసినావు?” దానికి ఆయన ఇలా బదులు పలికినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను దీనిని కంఠస్థము చేసినాను - “సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”

[దృఢమైనది]

الشرح

సందేహాలకు, అనుమాలకు దారి తీసే ఏవైనా మాటలు కానీ, చేతలు కానీ ఉంటే, వాటిని వదిలి వేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు; అవి నిషేధించబడిన విషయాలు అయినా, కాకపోయినా సరే, అవి అనుమతించబడిన విషయాలు అయినా లేదా నిషేధించబడిన విషయాలు అయినా సరే – వాటికి బదులుగా కేవలం వాటినే ఎంచుకొండి వేటిలోనైతే సందేహాలకు, అనుమాలకు తావు లేదో; వేటి గురించైతే అవి మంచివి అనీ, పరిశుద్ధమైనవి అనీ, చట్టసమ్మతమైనవి అనీ (షరియత్ ఆమోదించినవని) మీకు ఖచ్చితంగా తెలుసునో వాటిని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే వాటిలో హృదయం శాంతి మరియు ప్రశాంతతను పొందుతుంది, కానీ సందేహాన్ని కలిగించే, అనుమానాలు రేకెత్తించే విషయాలు హృదయాన్ని ఆందోళనకు మరియు కలతకు గురి చేస్తాయి.

فوائد الحديث

ఒక ముస్లిం తన వ్యవహారాలను నిశ్చితత్వం, స్థిరత్వం పైనే స్థాపించాలి మరియు సందేహాస్పదంగా ఉన్న దాన్ని వదిలి వేయాలి మరియు అతడు తన ధర్మాన్ని గురించి అంతర్ దృష్టి మరియు మంచి అవగాహన కలిగి ఉండాలి.

సందేహాస్పదమైన మరియు అనుమానాలు రేకెత్తించే వ్యవహారాలలో పడరాదని నివారించబడింది.

మీరు ప్రశాంతత మరియు సౌకర్యాన్ని కోరుకుంటే, సందేహాస్పదమైన వాటిని వదిలి వేయండి మరియు వాటిని ప్రక్కన పెట్టండి.

అల్లాహ్ తన దాసులపై కరుణ, దయ కలిగి ఉంటాడు, ఆత్మకు మరియు మనస్సుకు శాంతిని కలిగించే వాటిని చేయమని ఆజ్ఞాపించాడు; ఆందోళన, అశాంతి మరియు గందరగోళాన్ని కలిగించే వాటిని వదిలి వేయాలని నిషేధించాడు.

التصنيفات

విబేదించటం మరియు ప్రాధాన్యతనివ్వటం