“నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే”

“నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే”

అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే”.

[దృఢమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని విషయాలను గురించి తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ పనులకు పాల్బడితే వారు ‘షిర్క్’నకు పాల్బడినట్లే. అవి: మొదటిది: అల్-రుఖయ్య: ఇస్లాంకు పూర్వం అఙ్ఞానకాలంలో జబ్బున పడిన వారిని నయం చేయుటకు బహుదైవారాధనకు చెందిన పదాలతో (మంత్రాల లాగా) కొన్ని మాటలు పలుకబడేవి (ఇస్లాం లో ఈ విధంగా బహుదైవారధనకు చెందిన పదాలతో నయం చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే అది బహుదైవారాధనగా (“షిర్క్” గా) పరిగణించబడుతుంది). రెండవది: అల్ తమాఇమ్ (తాయెత్తులు). అవి పూసలతో చేసినవి కావచ్చు లేక ఇంక దేనితో నైనా చేసినవి కావచ్చు: కీడును దూరం చేయడానికి తాయెత్తులను చిన్న పిల్లలకు, జంతువులకు, వాహనాలకు మొదలైన వాటికి కడుతూ ఉంటారు. మూడవది: అల్-తివాలహ్ (వశీకరణం): ఈ ప్రక్రియను ఒకరి భార్యను మరొకరు వశపరుచు కోవడానికి వాడుతారు. ఇవి బహుదైవారాధనగా (షిర్క్ గా) పరిగణించబడతాయి. ఎందుకంటే, షరియత్ లో లేని, షరియత్ ఆదేశించని ఒక విషయాన్ని మూలకంగా/సాధనంగా తీసుకుని దానిపై ఆచరించడం జరుగుతున్న ది. దానికి షరియత్ లో ఆధారాలు ఉండవు, అలాగే అది ఙ్ఞానేంద్రియాల ద్వారా అనుభవం లోనికి వచ్చిన విషయం కూడా అయిఉండదు. షరియత్ ఆమోదించిన విధానాలలో ఖుర్’ఆన్ పఠనం, అనుభవం ద్వారా నిరూపణ అయి ఉన్న మందులను ఉపయోగించడం ఉన్నాయి. ఇవి ఆమోద యోగ్యమైనవి, విశ్వాసయోగ్యమైనవి. ప్రయోజనం కలగడం, కలుగకపోవడం, లేదా కీడు కలగడం అనేవి అల్లాహ్ చేతిలోని విషయం.

فوائد الحديث

ఇందులో ఏకదైవారాధన (అల్లాహ్ యొక్క ఏకత్వము) యొక్క ఘనత, ప్రాధాన్యత మరియు తౌహీద్ నందు విశ్వాసము నుండి మరలకుండా ఉండుట యొక్క ప్రాధాన్యత ఉన్నాయి.

అలాగే, బహుదైవారాధనకు (‘షిర్క్’నకు) సంబంధించిన మంత్ర-తంత్రాలను ఉపయోగించుట, తావీజులు, మరియు వశీకరణలు మొదలైనవి నిషేధించబడినాయి.

ఈ మూడు విషయాలలో విశ్వాసముంచడం తక్కువ స్థాయి షిర్క్ అనబడుతుంది: ఎందుకంటే, వీటికి పాల్బడే వాడు షరియత్ లో లేని విషయాన్ని ఒక సాధనంగా చేసుకున్నాడు, దాని ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించాలని. ఒకవేళ అతడు అల్లాహ్ పై గాక ఆ సాధనంలోనే విశ్వాసముంచి నట్లయితే, ఆ సాధనమే అతనికి ప్రయోజనాన్ని లేక కీడును, చెడును కలుగజేస్తుందని విశ్వసించినట్లయితే, అది ‘పెద్ద స్థాయి షిర్క్’ అవుతుంది.

ఇందులో - నిషేధించబడిన బహుదైవారాధన విధానాలను సాధనాలుగా చేసుకోవడానికి సంబంధించి తీవ్రమైన హెచ్చరిక ఉన్నది.

షరియత్ ఆమోదించిన విధానం తప్ప మంత్ర తంత్రాలను ఉచ్ఛరించడం బహుదైవారాధన రూపాలలో ఒకటి, మరియు అది నిషేధించబడినది.

విశ్వాసి హృదయం యొక్క సంబంధం ఎల్లప్పుడు కేవలం ఏకైకుడైన అల్లాహ్ తో మాత్రమే ఉండాలి. తనకు ఎవరూ మరియు ఏదీ సాటి లేని ఆ అల్లాహ్ నుండి మాత్రమే ప్రయోజనం కలగడమైనా, కలుగక పోవడమైనా లేదా ఏదైనా నష్టము, కీడు, హాని, కలుగడమైనా జరుగుతాయని విశ్వసించాలి. అల్లాహ్ తప్ప ఎవరూ ప్రయోజనం చేకూర్చలేరు, అల్లాహ్ తప్ప ఎవరూ కీడు నుండి రక్షించలేరు.

ఆమోదించబడిన ‘అల్ రుఖయ్య’ విధానం మూడు షరతులకు లోబడి ఉంటుంది. 1- రుఖయ్య చేయు వ్యక్తి, అది కేవలం ఒక మాధ్యమం మాత్రమే అని, అల్లాహ్ యొక్క అనుమతి లేనిదే అది స్వయంగా ఏమీ ప్రయోజనం కలిగించలేదనే సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. 2-అల్’రుఖయ్య అనేది ఖుర్’ఆన్ ఆధారితంగా ఉండాలి, అల్లాహ్ యొక్క పేర్లు, మరియు గుణగణాలతో కూడి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దువాలు మరియు షరియత్’కు అనుగుణంగా ఉండే దువాలతో కూడినదై ఉండాలి. 3- అది వినే వారికి అర్థమయ్యే భాషలో ఉండాలి, అందులో క్షుద్రవిద్య, చేతబడి మొదలైనవి లేనిదై ఉండాలి.

التصنيفات

షరఈ రుఖయ్య