బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో…

బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: "బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు".

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ - అసలైన శక్తి లేక బలం అంటే అది శరీర దారుఢ్యం వలన కలిగేది కాదు లేక బలశాలి అంటే ఇతర బలశాలులను చిత్తు చేసేవాడు కాేదు - అని వివరిస్తున్నారు. నిజానికి బలశాలి అంటే తీవ్రమైన కోపానికి లోనైనపుడు తనకు వ్యతిరేకంగా తానే పోరాడే వాడు, తనకు వ్యతిరేకంగా తానే శ్రమించేవాడు. ఎందుకంటే ఆ పోరాటం తనను తాను నియంత్రణలో ఉంచుకోవడం, తనను తాను అదుపులో ఉంచుకోవడం సాధ్యమయ్యేలా చేస్తుంది.

فوائد الحديث

ఇందులో తీవ్రమైన కోపానికి గురైనపుడు సహనం వహించడం, వివేకాన్ని, వివేచనను కోల్పోకుండా స్వీయ నియంత్రణ కలిగి ఉండడం యొక్క ఘనత తెలుస్తున్నది.

తీవ్రమైన కోపములో ఉన్నపుడు తనకు వ్యతిరేకంగా తానే పోరాడుట అనేది శత్రువుకు వ్యతిరేకంగా పోరాడుట కంటే కూడా ఘనమైన విషయం.

ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలములో 'శక్తి' కి సంబంధించి ఉన్న భావనను ఇస్లాం ఒక ఉత్తమ నైతిక భావనలోనికి మార్చి వేసింది. కనుక ఇస్లాం ప్రకారం శక్తిశాలి అయిన వ్యక్తి అంటే తనను తాను అదుపులో ఉంచుకునేవాడు, తనపై నియంత్రణను కోల్పోని వాడు.

కనుక 'కోపం' నుండి ముఖం త్రిప్పుకోవాలి, ఎందుకంటే కోపం ద్వారా వ్యక్తులకు, తద్వారా సమాజం మొత్తానికి కలిగించే నష్టం ఎక్కువ.

التصنيفات

సద్గుణాలు, సద్గుణాలు