“మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను…

“మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇళ్ళలో నమాజు ఆచరించకుండా ఉండుటను, తద్వారా ఇళ్ళు స్మశానాల మాదిరిగా మారుటను నిషేధించినారు, ఎందుకంటే స్మశానలలో నమాజులు ఆచరించబడవు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటి నుండి షైతాను పారిపోతాడు అని అన్నారు.

فوائد الحديث

(షరియత్ అనుమతించిన) ఆరాధనలలో అనేక రకాల ఆరాధనలు (ఉదా: సున్నత్ మరియు నఫీల్ నమాజు, జిక్ర్ చేయుట, ఖురాన్ పఠనము మొ.) ఇంటిలో ఆచరించుట అభిలషణీయం.

స్మశానాలలో నమాజులను ఆచరించుట నిషేధము. ఎందుకంటే అది బహుదైవారాధనకు (షిర్క్ నకు) దారి తీసే కారణాలలో ఒక కారణం, మరియు దాని అనుయాయులు అందులో హద్దులు మీరడానికి కూడా ఒక కారణం. అయితే మృతుని కొరకు ఆచరించబడే నమాజు (సలాతుల్ జనాయిజ్) తప్ప.

స్మశానాలలో నమాజు ఆచరించడం నిషేధము అనే విషయాన్ని సహాబాలు ఖచ్చితంగా వ్యవస్థాపించడం చూస్తాము మనం. అదే విధంగా నమాజులు ఆచరించుట నిషేధించబడిన స్మశానాల మాదిరిగా ఇళ్ళు మారడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు.

التصنيفات

సూరాలు మరియు ఆయతుల ప్రాముఖ్యతలు.