إعدادات العرض
“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు)…
“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt ئۇيغۇرچە Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Kiswahili ગુજરાતી አማርኛ پښتو ไทย Română മലയാളം Deutsch Oromoo ქართული नेपाली Magyar Mooreالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఉదూ చేసిన తరువాత ఒక ముస్లిం తన రెండు పాదాలకు “ఖుఫ్ఫైన్” తొడుగుకున్నట్లయితే; తరువాత ఒకవేళ ఉదూ భంగపడినట్లయితే, తిరిగి ఉదూ ఆచరించునపుడు అతనికి ఇష్టమైతే “ఖుఫ్ఫైన్” ను పాదాల నుంచి తొలగించకుండా వాటిపైన తడిచేతులతో మసహ్ చేసి (తడిచేతులతో తడిమి) వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే నమాజు ఆచరించవచ్చు. ఈ విధంగా అతడు “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోను కానంత వరకు, ఒక నియమిత కాలం వరకు చేయవచ్చు. జనాబత్ స్థితికి లోనైతే మాత్రం ఖుఫ్ఫైన్’ను కాళ్ళ నుండి తొలగించి అతడు గుసుల్ చేయవలసి ఉంటుంది.فوائد الحديث
సంపూర్ణంగా ఉదూ ఆచరించిన తరువాత పాదాలకు ఖుఫ్ఫైన్ తొడుగుకుని ఉంటే తప్ప వాటిపైన ‘మసహ్’ చేయుటకు అనుమతి లేదు.
ఖుఫ్ఫైన్’పై మసహ్ చేయుటకు స్థానికులకు కాలపరిమితి: ఒక దినము మరియు ఒక రాత్రి (24 గంటలు);
ఖుఫ్ఫైన్’పై మసహ్ చేయుటకు ప్రయాణీకులకు కాలపరిమితి: మూడు దినములు మరియు మూడు రాత్రులు (72 గంటలు);
ఖుఫ్ఫైన్ పై మసహ్ చేయుట కేవలం ‘హదథ్ అల్ అస్గర్’ స్థితికి (చిన్న అపరిశుద్ద స్థితికి) మాత్రమే పరిమితం. ‘హదథ్ అల్ అక్బర్’ స్థితిలో ఖుఫ్ఫైన్ పై మసహ్ చేయుటకు అనుమతి లేదు. ఆ స్థితిలో ఖుఫ్ఫైన్’ను పాదములనుంచి పూర్తిగా తొలగించి (గుసుల్’లో భాగంగా) వాటిని శుభ్రంగా కడగవలసి ఉంటుంది.
యూదుల విధానానికి వ్యతిరేకంగా ఉండేలా, కాళ్ళకు పాదరక్షలు, ఖుఫ్ఫైన్ లాంటివి తొడిగి ఉన్న స్థితిలోనే నమాజు ఆచరించమని సిఫార్సు చేయబడుతున్నది. అయితే పాదరక్షలు లేదా ఖుఫ్ఫైన్’లు అపరిశుబ్రంగా ఉన్నా, లేక ఏదైనా మలినం అంటుకుని ఉన్నా, లేక తోటి వారికి కష్టం లేదా అసౌకర్యం కలిగేలా ఉన్నా, లేక అన్ని సదుపాయాలు అమర్చబడి, చక్కగా పరిశుభ్రంగా ఉన్న మస్జిదులలో అలా చేయరాదు.
ఖుఫ్ఫైన్’పై మసహ్ చేసే అనుమతి ఈ ఉమ్మత్’కు ఉదూ విషయాన్ని సులభతరం మరియు మరింత సౌకర్యవంతం చేస్తుంది.