“ప్రజలు ఒక దౌర్జన్యపరుడిని (లేక అణచివేతదారుని) చూసి కూడా, అతడిని అడ్డుకోకపోతే, అల్లాహ్ తన తరఫునుండి వారందరికీ…

“ప్రజలు ఒక దౌర్జన్యపరుడిని (లేక అణచివేతదారుని) చూసి కూడా, అతడిని అడ్డుకోకపోతే, అల్లాహ్ తన తరఫునుండి వారందరికీ శిక్ష విధిస్తాడు.”

అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఇలా పలికినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా మీరు ఈ ఆయతును పఠిస్తారు: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنْفُسَكُمْ لاَ يَضُرُّكُمْ مَنْ ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ}، [ఓ విశ్వాసులారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనుక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే, దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించలేరు.....] (సూరహ్ అల్ మాఇదహ్ 5:105) మరియు నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా విన్నాను: “ప్రజలు ఒక దౌర్జన్యపరుడిని (లేక అణచివేతదారుని) చూసి కూడా, అతడిని అడ్డుకోకపోతే, అల్లాహ్ తన తరఫునుండి వారందరికీ శిక్ష విధిస్తాడు.”

[దృఢమైనది]

الشرح

అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రజలు ఖుర్’ఆన్ యొక్క ఈ ఆయతును పఠిస్తారు: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنْفُسَكُمْ لاَ يَضُرُّكُمْ مَنْ ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ} [المائدة: 105]. [ఓ విశ్వాసులారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనుక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే, దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించలేరు.....] (సూరహ్ అల్ మాఇదహ్ 5:105) ఆ ఆయతును పఠించడం ద్వారా వారు – తమ గురించి తాము జాగ్రత్తపడితే చాలునని (అంటే తాము సంస్కారవంతంగా ఉంటే చాలునని); తాము సరియైన మార్గములో నడిస్తే చాలునని, ఆ తర్వాత మార్గభ్రష్ఠుడైన వాని మార్గభ్రష్ఠత్వము వల్ల తమకు నష్టం గానీ, కీడుగానీ జరుగదని; మంచి చేయమని ఆఙ్ఞాపించవలసిన అవసరం, చెడును నిషేధించవలసిన అవసరం తమకు లేదని అర్థం చేసుకుంటారు. కనుక అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు దాని అర్థము అది కాదు అని, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా విన్నాను అని వారికి తెలియజేస్తున్నారు: ప్రజలు అణచివేతదారుడిని చూసి కూడా అతడిని అణచివేతకు, దౌర్జన్యానికి పాల్బడుట నుండి నిరోధించే శక్తి, సామర్థ్యము ఉండి కూడా అతడిని నిరోధించకపోతే, అల్లాహ్ తన తరఫు నుండి ప్రతి ఒక్కరినీ శిక్షించే అవకాశం ఉంది, తప్పు చేసిన వానిని మరియు దాని గురించి మౌనంగా ఉన్న వానిని కూడా.

فوائد الحديث

ముస్లిములు ఒకరికొకరు ఉపదేశించుకోవలసిన బాధ్యత వారిపై ఉన్నది. అలాగే వారు మంచి చేయమని ఆదేశించాలి, మరియు చెడును నిరోధించాలి, అది కూడా వారి బాధ్యత.

అల్లాహ్ తరఫు నుండి వచ్చి పడే శిక్ష సాధారణంగా దౌర్జన్యపరునికి అతని దౌర్జన్యం కారణంగా ఉంటుంది, మరియు ఎవరైతే దానిని ఖండించగలిగి కూడా మౌనంగా ఉంటారో వారిని కూడా అందులో కలుపుకుంటుంది.

ప్రజలకు విషయాలను బోధించాలి, ఖుర్’ఆన్ లోని ఆయతులను వారు సరిగా అర్థం చేసుకునేలా చేయాలి.

అల్లాహ్ ఉద్దేశించిన విధంగా గాక దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోకుండా ఉండడానికి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదివి సరిగా అర్థం చేసుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మంచిని చేయమని ఆఙ్ఞాపించడం, చెడును నిషేధించడం వదలివేయడం వల్ల సన్మార్గమువైపునకు మార్గదర్శనం పొందుట సాధ్యము కాదు.

ఆ ఆయతు యొక్క సరియైన వివరణ: పాపాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కట్టుబడి ఉండండి, ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకుంటే, ఒకవేళ మీరు మంచి చేయమని ఆదేశించలేకపోయినా, లేక చెడును నిషేధించలేకపోయినా అది మీకు హాని కలిగించదు; ఎందుకంటే నిషేధించబడిన పనులకు పాల్బడుతూ మార్గభ్రష్ఠత్వములో పడిపోయిన వాని మార్గభ్రష్టత్వాన్ని, మరియు ఆ పనులను దూరంగా ఉంచగలిగేలా మీరు సన్మార్గం పైన ఉన్నట్లయితే.

التصنيفات

మంచి గురించి ఆదేశం మరియు చెడు నుండి వారించటం యొక్క ఆదేశం