“ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే…

“ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు – అల్లాహ్ యొక్క ప్రీతి, ఆశీర్వాదాలు పొందే మార్గాలలో ఒకటి – దాసుడు తన ప్రభువు (అల్లాహ్) యొక్క అనుగ్రహాల పట్ల, ఆయన దాతృత్వము, కారుణ్యము పట్ల ఆయనను (అల్లాహ్ ను) స్తుతించుట, కీర్తించుట. అతడు ఏదైనా ఆహారాన్ని భుజింనపుడు “అల్’హందులిల్లాహ్” (సకల స్తోత్రములు, పొగడ్తలు, కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి) అంటాడు, అతడు ఏదైనా పానీయము త్రాగినపుడు “అల్’హందులిల్లాహ్” (సకల స్తోత్రములు, పొగడ్తలు, కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి) అంటాడు.

فوائد الحديث

ఈ హదీసులో అల్లాహ్ యొక్క దాతృత్వపు ఘనత తెలియుచున్నది – జీవించుట కొరకు ఆయన ఉపాధి ప్రసాదిస్తున్నాడు. అందుకు కేవలం స్తుతులు, ప్రశంసలు, కృతజ్ఞతలతోనే సంతృప్తి చెందుతున్నాడు.

అల్లాహ్ యొక్క సంతృప్తిని, సంతోషాన్ని పొందే సులభమైన మార్గము, తిన్న తరువాత, త్రాగిన తరువాత “అల్’హందులిల్లాహ్” అని ఆయనను స్తుతించడం.

(అన్నం) తినుట మరియు (నీళ్ళు) త్రాగుటకు సంబంధించిన మర్యాదలు: తిన్న తరువాత, త్రాగిన తరువాత తప్పనిసరిగా “అల్’హందులిల్లాహ్” (సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి) అని అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుట.

التصنيفات

తినే మరియు త్రాగే పద్దతులు