“ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశానుసారం జరుగుతుంది; చివరికి శక్తి (కలిగి ఉండుట), అశక్తత, లేక (అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్…

“ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశానుసారం జరుగుతుంది; చివరికి శక్తి (కలిగి ఉండుట), అశక్తత, లేక (అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ బహుశా ఇలా అన్నారు) అశక్తత మరియు శక్తి (కలిగి ఉండుట) కూడా”

తావూస్ అల్ యమానీ (తాబయీ) రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సహాబాలలో కొంతమందిని నేను ఎరుగుదును. వారు ఇలా అనేవారు “ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశం మేరకే జరుగుతుంది” అని. తావూస్ ఇంకా ఇలా అన్నారు “అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఇలా పలుకగా నేను విన్నాను “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశానుసారం జరుగుతుంది; చివరికి శక్తి (కలిగి ఉండుట), అశక్తత, లేక (అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ బహుశా ఇలా అన్నారు) అశక్తత మరియు శక్తి (కలిగి ఉండుట) కూడా”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రతి విషయమూ విధి లిఖితమై ఉన్నది (ముందుగానే లిఖించబడి ఉన్నది) అని తెలియ జేస్తున్నారు. చివరికి అశక్తత కూడా - అంటే చేయవలసిన ఆచరణను చేయకుండా వదిలి వేయడం, శక్తి లేకపోవడం, అనాసక్తత, సోమరితనం మొదలైనవి, లేక అవసరం లేకపోయినా దాని సమయం గడిచి పోయేటంత వరకూ అందులో జాప్యం చేయడం – అవి ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా, లేక పరలోక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా. అదే విధంగా తెలివి, బుద్ధీ, ఙ్ఞానము కూడా ముందుగానే లిఖించబడి ఉంటాయి. అంటే, ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా, లేక పరలోక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా వాటిని ఆచరించుటలో ఆతురత, వేగము, వాటిని ఙ్ఞానపూర్వకముగా ఆచరించుట మొదలైనవి. ఈ హదీసులో, సర్వోన్నతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన అల్లాహ్ ప్రతి విషయానికి సంబంధించి సమర్థత, సామర్థ్యాలను, శక్తి, అశక్తత లను ముందుగా విధి లిఖితములో లిఖించినాడు – ప్రతి విషయమూ కూడా అల్లాహ్ యొక్క ఙ్ఞానములో ఉంటుంది, మరియు ఆయన ఇచ్ఛకు లోబడి ఉంటుంది అని తెలుస్తున్నది.

فوائد الحديث

ఇందులో “అల్-ఖద్ర్” (విధి లిఖితము) లో సహబాల యొక్క విశ్వాసమునకు (అఖీదాకు) సంబంధించి చెప్పబడుచున్నది.

ప్రతి విషయమూ అల్లాహ్ యొక్క ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది, చివరికి శక్తి మరియు అశక్తత (సామర్థ్యము మరియు అసమర్థత) కూడా.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథులను ఉల్లేఖించుటలో, ఒకరినుండి మరొకరికి చేరవేయుటలో సహబాల యొక్క జాగరూకత మనకు కనిపిస్తుంది.

“అల్ ఖద్ర్” ను (విధి లిఖితాన్ని) విశ్వసించడం – అంటే అందులోని మంచిని, చెడును విశ్వసించడం తప్పనిసరి.

التصنيفات

తీర్పు , విధి వ్రాత పై విశ్వాసం., తీర్పు,విధి వ్రాత యొక్క దశలు