“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని…

“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా” అన్నారు. మరియు 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా నరకంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ఆయనను ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నోటి కారణంగా మరియు జననేంద్రియాల కారణంగా” అని సమాధాన మిచ్చినారు”.

[ప్రామాణికమైనది,దృఢమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలోనికి ప్రవేశించడానికి ప్రబలమైన కారణాలు రెండు అని తెలియజేస్తున్నారు. అవి, అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) మరియు సత్ప్రవర్తన, సచ్ఛీలము, మంచి నడవడిక. అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట: అంటే నీకూ మరియు అల్లాహ్ యొక్క శిక్షకూ మధ్య ఒక రక్షణ తెర కలిగి ఉండుట. అది అల్లాహ్ యొక్క ఆదేశాలను ఆచరించుట ద్వారా మరియు ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండుట ద్వారా సాధ్యమవుతుంది. మరియు సత్ప్రవర్తన, సత్శీలము: ప్రజలను గౌరవించడం, వారి పట్ల సహృదయత, ఔదార్యం, వారికి మంచి చేయుట, వారి నుండి చెడును, కీడును దూరం చేయుట మొదలైన వాటి వలన ప్రతీతమవుతుంది. అలాగే నరకంలోనికి ఎక్కువగా ప్రవేశించడానికి ప్రబలమైన కారణాలు రెండు. అవి నాలుక మరియు జననేంద్రియాలు. నాలుక, మనిషి పాపాల కారణాలలో ఒకటి. అబద్ధం చెప్పుట, అపనిందలు మోపుట, ప్రచారం చేయుట, వ్యక్తుల పరోక్షములో వారిని గురించి చెడుగా మాట్లాడుట మొదలైనవి. వ్యభిచారానికి పాల్బడుట, స్వలింగ సంపర్కము మొదలైనవి జననేంద్రియాల కారణాలలోని వస్తాయి.

فوائد الحديث

స్వర్గంలోనికి ప్రవేశింపజేసే కారణాలు – అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ కలిగి ఉండడం, సత్ప్రవర్తన, ప్రజలతో సౌహార్ద్ర సంబంధాలు కలిగి ఉండడం ఇవన్నీ అల్లాహ్ కు చెందిన విషయాలు, ఆయనతో సంబంధం కలిగిన విషయాలు.

కానీ నాలుక వలన కలిగే హాని, చెరుపు మొదలైనవి ఆ మనిషితో సంబంధం కలిగిన విషయాలు. నాలుక, నరకంలోనికి ప్రవేశింపజేసే కారణాలలో ఒకటి.

మనిషిలోని కామేచ్ఛ, లాలస, సిగ్గుమాలిన తనము – ఇవి అతడిని నరకంలోనికి ప్రవేశింపజేయడానికి సర్వసాధారణ కారణాలు.

التصنيفات

సద్గుణాలు, స్వర్గము,నరకము యొక్క లక్షణాలు