ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు) స్వర్గము యొక్క సుగంధాన్ని కూడా వాసన చూడలేడు;…

ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు) స్వర్గము యొక్క సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; నిశ్చయంగా స్వర్గపు సుగంధము నలభై సంవత్సరాల (ప్రయాణపు) దూరము నుండి కూడా చూడగలిగినప్పటికీ. (ముఆహద్: ముస్లిముల రాజ్యములోనికి - తన ప్రాణానికి రక్షణ ఉంటుంది అనే ఒప్పందముపై - ప్రవేశించిన వ్యక్తి)

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు) స్వర్గము యొక్క సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; నిశ్చయంగా స్వర్గపు సుగంధము నలభై సంవత్సరాల (ప్రయాణపు) దూరము నుండి కూడా చూడగలిగినప్పటికీ. (ముఆహద్: ముస్లిముల రాజ్యములోనికి - తన ప్రాణానికి రక్షణ ఉంటుంది అనే ఒప్పందముపై - ప్రవేశించిన వ్యక్తి).

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అతి తీవ్రమైన హెచ్చరికను గురించి తెలియజేస్తున్నారు – అది ఎవరైతే ఒక ‘ముఆహద్’ ను – అంటే అతడు అవిశ్వాసుల ప్రదేశము నుండి, ఇస్లామీయ రాజ్యము లోనికి ఏదైనా ఒప్పందంపై, మరియు రక్షణ ఒడంబడికపై ప్రవేశించిన అవిశ్వాసి అయి ఉంటాడు, అతడిని – చంపినట్లయితే, ఆ హంతకుడు స్వర్గపు సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; స్వర్గపు సుగంధము, నిజానికి, నలభై సంవత్సరాల (ప్రయాణమంత) దూరమునుండి కూడా చడగలిగినదై ఉన్నప్పటికీ.

فوائد الحديث

అవిశ్వాసులలో – ఒక ‘ముఆహద్’ ను, లేక ఒక ‘జిమ్మీ’ ని, లేక ఒక ‘ముస్త’మన్’ ను చంపుట నిషేధము. అది ఘోరమైన పాపములలో ఒకటి.

ముఆహద్: ఎవరైతే ముస్లిములతో రక్షణ ఒప్పందంతో సహా ఏదైనా ఒప్పందములో ఉన్న అవిశ్వాసి; అతడు తన రాజ్యము/దేశములోని ఉంటాడు. యుద్ధములో అతడు ముస్లిములకు వ్యతిరేకముగా పోరాటం చేయడు, మరియు ముస్లిములు అతనితో పోరాటం చేయరు. అతడు ముస్లిముల రాజ్యములోనికి ప్రవేశించినా ఇదే సూత్రము వర్తిస్తుంది.

జిమ్మీ: ముస్లిముల రాజ్యములో అధికారికముగా పన్ను చెల్లిస్తూ నివసిస్తున్న వ్యక్తి.

ముస్త’మన్: ‘విశ్వాస పాత్రుడైన అవిశ్వాసి’; అతడు రక్షణతో సహా ఇంకేదైనా ఒప్పందముపై ముస్లిం రాజ్యములోని ఒక నియమిత కాలము కొరకు ప్రవేశించినట్లయితే, అటువంటి వానిని చంపుట నిషేధము.

ఈ హదీసులో అవిశ్వాసులతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలని, వాటిని ఉల్లంఘించరాదనే హెచ్చరిక ఉన్నది.

التصنيفات

జిమ్మీల ఆదేశాలు