అపుడు (ఆయనను ప్రస్తుతిస్తూ) మేము ఇలా అన్నాము: “(ఓ ప్రవక్తా!) నీవు మా సార్వభౌముడవు”. దానికి ఆయన ఇలా అన్నారు:…

అపుడు (ఆయనను ప్రస్తుతిస్తూ) మేము ఇలా అన్నాము: “(ఓ ప్రవక్తా!) నీవు మా సార్వభౌముడవు”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ యే సార్వభౌముడు”. అపుడు మేము ఇలా అన్నాము: “ఘనతలో మాలో ఉత్తముడు; మహనీయతలో మాలో సమున్నతమైనవాడు (అనవచ్చునా?)”. దానికి ఆయన “మీరు సాధారణంగా మాట్లాడే మాటలే పలకండి – లేక మీరు ఒకరినొకరు పలికే విధంగా పలకండి; షైతాను మిమ్ములను ప్రలోభానికి గురిచేయనివ్వకండి.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అష్’షిఖ్'ఖీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను బనూ ఆమిర్ తెగ ప్రతినిధి బృందముతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను కలవడానికి బయలుదేరి వెళ్ళాను. అపుడు (ఆయనను ప్రస్తుతిస్తూ) మేము ఇలా అన్నాము: “(ఓ ప్రవక్తా!) నీవు మా సార్వభౌముడవు”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ యే సార్వభౌముడు”. అపుడు మేము ఇలా అన్నాము: “ఘనతలో మాలో ఉత్తముడు; మహనీయతలో మాలో సమున్నతమైనవాడు (అనవచ్చునా?)”. దానికి ఆయన “మీరు సాధారణంగా మాట్లాడే మాటలే పలకండి – లేక మీరు ఒకరినొకరు పలికే విధంగా పలకండి; షైతాను మిమ్ములను ప్రలోభానికి గురిచేయనివ్వకండి.”

[దృఢమైనది]

الشرح

కొంతమంది వ్యక్తుల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినది. వారు ఆయన దగ్గరికి వెళ్ళినపుడు వారు ఆయనను ప్రస్తుతించారు. వాటిలో కొన్ని మాటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడలేదు. వారు ఇలా అన్నారు: “(ఓ ప్రవక్తా!) నీవు మా నాయకుడవు, సార్వభౌముడవు” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: “(కేవలం) అల్లాహ్ మాత్రమే సార్వభౌముడు” ఆయన తన సృష్టి మొత్తముపై సంపూర్ణ సార్వభౌమత్వము గలవాడు. వారందరూ ఆయన దాసులు. దానికి వారు ఇలా అన్నారు: “నీవు ఘనతలో మా అందరిలో ఉత్తముడవు; స్థానములో, గౌరవములో మరియు వైశిష్ట్యములో మా అందరిలో అత్యుత్తముడవు.” “నీవు మహనీయతలో సమున్నతమైనవాడవు, మా అందరిలో ఔదార్యములో, విశిష్టతలో, స్థానములో ఉత్తముడవు.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తాము సాధారణంగా మాట్లాడుకునే విధంగానే మాట్లాడమని, ప్రయాసపడి గొప్పగొప్ప మాటలు పలుక రాదని; ఉన్న దానిని ఎక్కువ చేసి చెప్పుట, ముఖస్తుతి చేయుట వలన షైతాను వలలో పడరాదని, అది (ఇస్లాం లో) నిషిద్ధమైన బహుదైవారాధనకు, మరియు దానికి చేరువచేసే సాధనాలకు దారి తీస్తుందని - వారికి మార్గదర్శకం చేసారు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహబాల మనసులలో వారి అత్యున్నతమైన గౌరవం, వారి పట్ల మర్యాద తెలుస్తున్నాయి.

అలాగే ఇందులో డాంబికముగా మాట్లాడుట నిషేధమని, మితముగా మాట్లాడాలని ఉద్బోధ ఉన్నది.

ఇందులోని విషయం - తౌహీదును (ఏకదైవారాధనను) ఉల్లంఘించే మాటలను మరియు ఆచరణలను నిషేధించి తద్వారా తౌహీదును పరిరక్షించాలి.

ఎవరినైనా ప్రస్తుతించుటలో హద్దులు మీరుట నిషేధము, అది షైతాను ప్రవేశించే మార్గాలలో ఒకటి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదము సంతానానికి నాయకుడు, సార్వభౌముడు. హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను గురించి ఆ విధంగా అనడాన్ని వారించడం అది వారి అణకువ, వినయం కారణంగానే.

التصنيفات

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం