“అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న…

“అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”

మాఖిల్ ఇబ్న్ యసార్ అల్ ముజనియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను – “అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఎవరికైతే ప్రజలపై అధికారం చేయు ఏదైనా పదవినిస్తాడో మరియు దానికి బాధ్యులను చేస్తాడో, అటువంటి వారందరి గురించి వివరిస్తున్నారు. ఆ అధికారి ఒక రాజ్యానికి రాజు కావచ్చు, అలాగే ఒక పురుషుడు తన ఇంటికి మరియు ఒక స్త్రీ తన ఇంటికి బాధ్యులు కావచ్చు. తమ అధికార పరిధి క్రింద ఉన్న వారి హక్కులను వారికి ఇచ్చుటలో, వాటిని పరిరక్షించుటలో, వారు ఏమైనా కొరతకు పాల్బడినా లేక మోసానికి పాల్బడినా లేక వారికి సరియైన మార్గదర్శకత్వం చేయక పోయినా, ఆ ప్రజల ధార్మిక మరియు ప్రాపంచిక హక్కుల విషయంలో విఫలమైన వారిగా పరిగణించబడతారు. అటువంటి వారు నిశ్చయంగా అత్యంత కఠిన శిక్షకు పాత్రులవుతారు.

فوائد الحديث

ఈ హెచ్చరిక గొప్ప నాయకుడు మరియు ఆయన అధికారులు, సామంతులకు మాత్రమే ప్రత్యేకం కాదు. ఇది సాధారణంగా వారికి ఎవరినైతే అప్పగించినాడో వారందరికీ వర్తిస్తుంది.

ముస్లిముల విషయాలపై అధికారం కలిగిన ప్రతి ఒక్కరి పై విధిగా ఉన్న విషయం ఏమిటంటే, వారు తమ అధికారం క్రింద ఉన్న వారికి సరియైన మార్గదర్శకం చేయాలి, వారికి అప్పగించబడిన బాధ్యతను నిజాయితీగా నిర్వహించడానికి సంపూర్ణంగా కృషి చేయాలి మరియు మోసం, దగా మొదలైన వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి.

ఈ హదీసు ద్వారా - సార్వత్రికంగా ప్రజలందరిపై ఇవ్వబడిన అధికారం కానివ్వండి లేక ప్రత్యేకంగా కొందరిపై ఇవ్వబడిన అధికారం కానివ్వండి; ఆ అధికారం చిన్నది కానివ్వండి లేక పెద్దది కానివ్వండి – దానిని నిజాయితీగా నిర్వహించడం ఎంత ఘనమైన విషయమూ తెలుస్తున్నది.

التصنيفات

ధర్మబద్దమైన విధానం