ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”

ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”

బురైదహ్ ఇబ్న్ అల్ హసీబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సలాతుల్ అస్ర్’ను (అస్ర్ నమాజును) ఆచరించుటలో త్వరపడండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అస్ర్ నమాజును, ఉద్దేశ్యపూర్వకంగా, దాని నిర్ధారిత సమయాన్ని మించి ఆలస్యం చేయుటను గురించి హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తాడు, అతడు తన ఆచారణలను వ్యర్థం చేసుకున్న వాడు అవుతాడు, నిర్మూలించుకున్న వాడవుతాడు.

فوائد الحديث

ఈ హదీసులో అస్ర్ నమాజును దాని ప్రారంభ సమయములోనే ఆచరించాలనే ప్రోత్సాహం ఉన్నది. అలా ఆచరించడానికి స్వయంగా తగిన ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి.

ఇందులో - ఎవరైతే అస్ర్ నమాజును దాని నిర్ధారిత సమయములో ఆచరించకుండా నిర్లక్ష్యం చేస్తాడో, అలాంటి వాని కొరకు తీవ్రమైన హెచ్చరిక ఉన్నది. అస్ర్ నమాజును దాని నిర్ధారిత సమయం దాటి ఆలస్యంగా ఆచరించడం, మిగతా ఏ నమాజునైనా వదిలివేయడం కన్నా కూడా తీవ్రమైనది. ఎందుకంటే ఇది (విధిగా ఆచరించవలసిన - ఫర్జ్) నమాజులన్నింటిలోనూ మధ్యన ఉన్న నమాజు. దీనిని గురించి అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఈవిధంగా ఆదేశించినాడు:

“మీరు మీ నమా'జ్‌లను కాపాడుకోండి మరియు (ముఖ్యంగా) మధ్య నమా'జ్‌ను మరియు అల్లాహ్‌ సన్నిధానంలో వినయ- విధేయతలతో నిలబడండి.” (సూరహ్ అల్ బఖరహ్ : 2:238)

التصنيفات

నమాజ్ యొక్క అనివార్యమవటం మరియు దాన్ని వదిలే వాడి ఆదేశము, నమాజ్ యొక్క అనివార్యమవటం మరియు దాన్ని వదిలే వాడి ఆదేశము