إعدادات العرض
“కపట విశ్వాసి ఉపమానము రెండు గుంపుల మధ్య తిరుగుతూ ఉండే ఆడ గొర్రె ఉపమానము వంటిది. అది ఒకసారి ఈ గుంపు లోనికి…
“కపట విశ్వాసి ఉపమానము రెండు గుంపుల మధ్య తిరుగుతూ ఉండే ఆడ గొర్రె ఉపమానము వంటిది. అది ఒకసారి ఈ గుంపు లోనికి వెళితే, ఒకసారి ఆ గుంపు లోనికి వెళుతుంది”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారని అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖిస్తున్నారు: “కపట విశ్వాసి ఉపమానము రెండు గుంపుల మధ్య తిరుగుతూ ఉండే ఆడ గొర్రె ఉపమానము వంటిది. అది ఒకసారి ఈ గుంపు లోనికి వెళితే, ఒకసారి ఆ గుంపు లోనికి వెళుతుంది”.
[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština ગુજરાતી አማርኛ Yorùbá Nederlands اردو Español Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe Bosanski සිංහල हिन्दी Tiếng Việt Hausa മലയാളം Kiswahili ไทย پښتو অসমীয়া Shqip دری Ελληνικά Български Fulfulde Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Kurdî Oromoo Wolof Soomaali Français Tagalog Azərbaycan Українська bm தமிழ் Deutsch ქართული Português mk Magyarالشرح
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కపట విశ్వాసి స్థితిని గురించి వివరిస్తున్నారు. కపట విశ్వాసి స్థితి, తటపటాయింపుకు, సంశయానికీ లోనైన ఒక ఆడ గొర్రె వంటిది. గొర్రెల రెండు సమూహాలు ఉంటే, ఏ సమూహాన్ని అనుసరించాలో తెలియని స్థితిలో అది అటూఇటూ తచ్చాడుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉంటే నీవు ఒకసారి ఈ సమూహము లోనికి వెళతావు, మరోసారి ఆ సమూహము లోనికి వెళతావు. కనుక కపట విశ్వాసులు విశ్వాసానికీ అవిశ్వాసానికి మధ్య నిర్ణయించుకోలేని డోలాయమాన స్థితిలో పడి ఉంటారు. కనుక వారు బాహ్యంగానూ మరియు అంతరంగంగానూ (సంపూర్ణంగా) విశ్వాసులతోనూ ఉండరు, అలాగే వారు బాహ్యంగానూ మరియు అంతరంగంగానూ (సంపూర్ణంగా) అవిశ్వాసులతోనూ ఉండరు. నిజానికి వారు బాహ్యంగా (వేషభూషణాలు ధరించి) విశ్వాసులతోనూ, మరియు అంతరంగాలలో అనుమానాలు, సందేహాలతో, తటపటాయింపుల సంశయాలతో అవిశ్వాసులతో కలిసి ఉంటారు. కనుక కొన్ని సమయాలలో వారు విశ్వాసులతో ఉంటారు, మరి కొన్ని సమయాలలో వారు అవిశ్వాసులతో ఉంటారు.فوائد الحديث
వినే వారిని, తాను వివరిస్తున్న విషయానికి మరింత దగ్గరగా చేర్చేందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపమానాలను వినియోగించడం చూస్తాము.
ఇందులో కపట విశ్వాసుల స్థితిని గురించిన వివరణ ఉన్నది – వారిలో సందేహాలు, తడబాటు, నిలకడ లేని తనం కనిపిస్తాయి.
అలాగే ఈ హదీథులో కపట విశ్వాసుల స్థితికి సంబంధించి హెచ్చరిక ఉన్నది. మరియు విశ్వాసానికి సంబంధించి నిర్ణయాత్మకంగా ఉండాలని, విశ్వాసములో, బాహ్యంగానూ, అంతరంగంగానూ (సంపూర్ణంగా) సత్యసంధత ఉండాలనే సూచన ఉన్నది.
التصنيفات
కపటము