రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి)…

రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని దానిని కంఠస్థం చేసుకునేందుకు వ్రాసి ఉంచుకునే వాడిని. దానికి ఖురైషీయులు ఇలా అంటూ నన్ను వారించేవారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్నీ రాస్తున్నావా? ఆయన మానవమాత్రుడు, ఆయన కోపంలోనూ మాట్లాడుతారు, అలాగే సంతోషంలోనూ మాట్లాడుతారు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. (జరిగిన విషయాన్ని) తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రస్తావించినాను. అపుడు వారు తన చేతి వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని రాసిపెట్టుకుంటూ ఉండే వాడిని, ఆ విధంగా రాతలో వాటిని భద్రపరిచి ఉంచుకునేందుకు గాను. కాని ఖురైషీయులు నన్ను వారిస్తూ, ఇలా అన్నారు: ‘రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కూాడా ఒక మానవమాత్రుడే (మనలాగే). ఆయన సంతోషములోనూ మాట్లాడుతారు, మరియు కోపములోనూ మాట్లాడుతారు. కనుక (మాటలలో) తప్పు జరగవచ్చు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జరిగిన విషయాన్ని తెలియజేసినాను. అపుడు వారు వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “రాయి (ఓ అబ్దుల్లాహ్!), ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలున్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) ఏ స్థితిలో నైనా సత్యము తప్ప మరేమీ బయటకు రాదు, సంతోషపు స్థితిలోనైనా లేక కోపపు స్థితిలోనైనా.” ఖుర్’ఆన్’లో సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇలా పలికాడు: “వమా యన్’తిఖు అనిల్ హవా, ఇన్’హువ ఇలా వహ్యున్ యూహా) “అతను తన మనోవాంఛలను అనుసరించి మాట్లాడడు*. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింప జేయబడిన వ'హీ (దివ్యజ్ఞానం) తప్ప మరింకేమీ కాదు.” (సూరహ్ అన్’నజ్మ్ 53:3,4)

فوائد الحديث

కోపములోనైనా, లేక సంతోషములోనైనా, సర్వ శక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన తన ప్రభువు నుండి తనకు చేరిన విషయాలను ప్రజలకు చేరవేయుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ దోషరహితులే (ఆయన వల్ల ఎప్పుడూ తప్పు జరుగదు).

సహబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులను కంఠస్థము చేసుకునే విషయములోనూ మరియు దానిని ఇతరులకు చేరవేసే విషయములోనూ చాలా శ్రద్ధా, ఆసక్తీ కలిగి ఉండేవారు.

ఒక విషయము యొక్క సత్యానికి సంబంధించి చేసే ప్రమాణము వలె కాకుండా - ‘అల్లాహ్ సాక్షిగా’ అనుట, అది ప్రమాణము కాకపోయినా ఏదైనా ఆదేశానికి సంబంధించి అలా పలుకవచ్చు అనుటకు ఇందులో అనుమతి ఉన్నది.

ఙ్ఞానాన్ని రాసిపెట్టి ఉంచుకొనుట అనేది ఙ్ఞానాన్ని పరిరక్షించే సాధనాలలో ముఖ్యమైనది.

التصنيفات

సున్నత్ ప్రాముఖ్యత మరియు దాని స్థానం., దైవ ప్రవక్త సున్నత్ లను వ్రాయటం (ప్రచురించటం)., మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం