إعدادات العرض
హాని చేయకూడదు మరియు ప్రతిహాని కూడా చేయకూడదు
హాని చేయకూడదు మరియు ప్రతిహాని కూడా చేయకూడదు
అబూ సయీద్ సఅద్ ఇబ్నె మాలిక్ ఇబ్నె సినాన్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: హాని చేయకూడదు మరియు ప్రతిహాని కూడా చేయకూడదు
[హసన్ హదీథు] [ఇబ్న్ మాజహ్ మరియు అద్దారఖుత్నీ మొదలైనవారు ముస్నదుగా నమోదు చేసినారు:]
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം Kiswahili தமிழ் မြန်မာ ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands ગુજરાતી Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ Bambara ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
ప్రవక్త ముహమ్మద్ ﷺ స్పష్టంగా ఇలా తెలియజేశారు: హానికరమైనది ఏ రూపంలో ఉన్నా, దానిని తన కొరకు మరియు ఇతరుల కొరకు దూరంగా ఉంచడం తప్పనిసరి. ఎందుకంటే ఎవ్వరూ తమకు తాము హాని కలిగించుకోవడం గానీ, ఇతరులకు హాని కలిగించడం గానీ ధర్మసమ్మతం కాదు. ఒక వ్యక్తి నష్టానికి ప్రతీకారంగా నష్టాన్ని కలిగించడం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే న్యాయమైన ప్రతీకారం (ఖిసాస్) పద్ధతిలో తప్ప, నష్టాన్ని నష్టంతో తొలగించకూడదు. అది కూడా హక్కుల అతిక్రమణ లేకుండా మాత్రమే జరగాలి.فوائد الحديث
చట్టప్రకారంగానైనా సరే, తలపెట్టబడిన దాని కంటే ఎక్కువ మోతాదులో ప్రతిచర్య చేయుట నిషేధించబడినది.
అల్లాహ్ తన దాసులను, తమకు హాని కలిగించే ఏ పనినీ చేయమని ఆదేశించలేదు.
మాటల ద్వారా, ఆచరణల ద్వారా లేదా ఒక పనిని విడిచిపెట్టడం ద్వారా నష్టం కలిగించడాన్ని నిషేధించడంలో ఈ హదీథు ఒక ప్రాథమిక సూత్రంగా ఉన్నది.
షరియత్ యొక్క నియమాలలో ఒకటి: ‘షరియత్ (ఎవరికైనా, దేనికైనా) హాని కలిగించడాన్ని అనుమతించదు మరియు హానికి ప్రతిగా హాని తలపెట్టడాన్ని ఖండిస్తుంది.
التصنيفات
సిద్ధాంతపరమైన మరియు ఛాందసవాద నియమాలు