“బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో…

“బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియ జేస్తున్నారు: బంధువులతో బంధుత్వపు సంబంధాలను కొనసాగించడంలో మరియు వారితో దయ, కరుణా గుణాలతో వ్యవరించడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, వారు తనకు చేసిన ఉపకారానికి బదులుగా అటువంటి ఉపకారమే చేసే వాడు కాదు. వాస్తవానికి బంధుత్వపు బంధాలను జోడించి ఉంచడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, తనతో బంధుత్వాన్ని తెంచుకున్నా, తిరిగి దానిని జోడించేవాడు. వారు తనతో అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించినా సరే, వారిని దయతో, వాత్సల్యములతో కలిసే వాడు.

فوائد الحديث

షరియత్ ప్రకారం – బంధుత్వపు బంధాలను కాపాడటం, వాటిని కొనసాగించడం, వాటిని జోడించి ఉంచడం అంటే నీతో సంబంధాలను తెంచేసుకున్న బంధువులను నీవు స్వయంగా వెళ్ళి కలవడం, నీతో చెడుగా వ్యవహరించిన వారిని క్షమించడం, నిన్ను తమ నుండి నిషేధించిన వారికి, అవసర సమయంలో అన్ని విధాలా సహాయం చేయడం. బంధుత్వపు బంధాలను నిలిపి ఉంచడం అంటే, వారు మనకు ఒక మంచి చేస్తే బదులుగా వారికి మంచి చేయడం లేదా మనకు వారేదైనా మంచి చేస్తే దానికి ప్రతిఫలం చెల్లించడం ఎంతమాత్రమూ కాదు.

కనుక, బంధుత్వపు బంధాలను నిలిపి ఉంచడం అంటే – మనకు వీలైనంతలో వారికి సాధ్యమైనంత మంచిని చేయడం, అది ధనం రూపంలో నైనా కావచ్చును, వారి కొరకు దువా చేయడమైనా కావచ్చు, వారి కొరకు మంచి పనులు చేయమని ఆదేశించడం మరియు చెడుకు దూరంగా ఉండమని నివారించడం అయినా కావచ్చు లేదా వాటికి సమానమైనవి కావచ్చు అంటే మనకు వీలైనంతగా వారినుంచి కీడును దూరం చేయడం అన్నమాట.

التصنيفات

ముస్లిం సమాజం