“(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను…

“(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి జిబ్రయీల్ అలైహిస్సలాం తన వద్దకు వచ్చినపుడు జరిగిన విషయాన్ని వివరిస్తున్నారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి పలుమార్లు, మాటిమాటికి గట్టిగా నొక్కి చెప్పినారని, ఆదేశించినారని చెప్పారు. పొరుగువాడు అంటే మన ఇంటికి పొరుగునే ఉండే వాడు కావచ్చు లేక మన ఇంటికి సమీపంలో ఉండే వాడు కావచ్చు, అతడు ముస్లిం కావచ్చు, లేక అవిశ్వాసి కావచ్చు, మన బంధువు కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు; అతడి హక్కులను పరిరక్షించుట, అతనికి హాని, కీడు, నష్టము తలపెట్టకుండా ఉండుట, అతని పట్ల సత్ప్రవర్తనతో వ్యవహరించుట, అతడు ఏమైనా హాని, నష్టము తలపెడితే దానిపై సహనం వహించుట మొదలైన వాటి గురించి జిబ్రయీల్ అలైహిస్సలాం పలుమార్లు ఎంతగా చెప్పినారంటే, పొరుగువాని హక్కుల పట్ల గౌరవం, మరియు జిబ్రీల్ అలైహిస్సలాం పలుమార్లు గట్టిగా చెప్పడం చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తాను చనిపోయిన తరువాత తన సంపదకు పొరుగువానిని వారసునిగా చేస్తూ వహీ అవతరిస్తుందేమో అని సందేహించారు.

فوائد الحديث

ఇందులో, పొరుగువాని హక్కులు ఎంత ఘనమైనవో, వాటి పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో తెలుస్తున్నది.

పొరుగువానిని సంపదలో వారసునిగా చేసేటంత గట్టిగా అతని హక్కులను గురించి ప్రస్తావించడం అనేది, అతనితో గౌరవంగా ప్రవర్తించడం, అతనితో స్నేహంగా ప్రవర్తించడం, అతని పట్ల కరుణ కలిగి ఉండడం, అతడి నుండి కీడును, హానిని, చెడును దూరం చేయడం, అతడు జబ్బు పడితే వెళ్ళి అతడిని పరామర్శించడం, అతడి సంతోష సమయాలలో అతడికి శుభాకాంక్షలు చెప్పడం, అతడి కష్ట సమయాలలో అతడికి తోడ్పాటు నందజేయడం మొదలైన విషయాలు ఎంత ఆవశ్యకమైనవో తెలియజేస్తున్నది.

పొరుగువాడు మన ఇంటికి ఎంత దగ్గరగా ఉంటే అతని హక్కులు అంత ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

సమాజానికి మేలు చేసే విషయాలలో, పొరుగువారి పట్ల దయాగుణం, కరుణ కలిగి ఉండడం, వారి నుండి చెడును, కీడును దూరం చేయడం మొదలైన విషయాలలో, షరియత్ యొక్క సంపూర్ణత కనిపిస్తున్నది.

التصنيفات

సయోధ్య మరియు ఇరుగు పొరుగు వారి ఆదేశాలు