“ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు…

“ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”.

[దృఢమైనది] [దాన్ని ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు – దొంగతనం చేసేవారిలో అత్యంత హీనమైన వాడు ఎవరంటే, ఎవరైతే తన నమాజులో (సల్లాహ్ ను) దొంగతనం చేస్తాడో. ఎందుకంటే ఇతరుల ధనాన్ని దొంగిలిస్తే, దాని ద్వారా అతడు ఈ ప్రపంచములో ఏ కొద్దిగానైనా ఉపయోగం పొందగల అవకాశం ఉన్నది. ఇటువంటి దొంగ మాదిరి కాకుండా, ఇలాంటి దొంగ, తన పుణ్యఫలములో తానే దొంగతనం చేస్తున్నాడు, సలాహ్ యొక్క ప్రతిఫలములో తానే దొంగతనం చేస్తున్నాడు. అక్కడున్న వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా ప్రశ్నించారు – ఎవరైనా తన సలాహ్ లో ఎలా దొంగతనం చేయగలడు? అని దానికి వారు ఇలా అన్నారు “అతడు తన రుకూను పూర్తిగా ఆచరించడు, అలాగే తన సజ్దాహ్ లను పూర్తిగా ఆచరించడు”, ఆ విధంగా అతడు రుకూ నూ, సజ్దాహ్ లను (నిదానంగా, ప్రశాంతంగా కాకుండా) తొందర తొందరగా పూర్తిచేస్తాడు, వాటిని సంపూర్ణంగా ఆచరించడు.

فوائد الحديث

ఈ హదీసులో సలాహ్’ను కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించుట యొక్క ప్రాధాన్యత, అదే విధంగా సలాహ్ యొక్క అర్కాన్ లను (మూల స్తంభాలవంటి విషయాలను) తొందర తొందరగా కాకుండా, ప్రశాంతంగా, వాటిని సంపూర్ణంగా ఆచరించుట యొక్క ప్రాధాన్యత తెలియుచున్నది.

తన రుకూలను మరియి సజ్దాహ్ లను ప్రశాంతంగా, సంపూర్ణంగా ఆచరించని వానిని ‘దొంగ’ అని అభివర్ణించడంలో అటువంటి వారి కొరకు ఒక హెచ్చరిక ఉన్నది. అలాగే అవి పవిత్ర మైన ఆచరణలు అనే హెచ్చరిక ఉన్నది.

నమాజులలో రుకూలను మరియు సజ్దాహ్ లను సంపూర్ణంగా (పర్’ఫెక్ట్ గా) ఆచరించుట విధి. వాటిని ఆచరించుటలో మధ్యస్థంగా ఉండాలి (మరీ తొందర తొందరగా కాకుండా, లేక మరీ ఆలస్యంగా కాకుండా – మధ్యస్థంగా).

التصنيفات

నమాజు భాగాలు, నమాజ్ పద్దతి, నమాజ్ చదివే వారి తప్పిదాలు