“నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు…

“నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”

సమురా ఇబ్న్ జుందుబ్ మరియు ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”

[దృఢమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే తన పేరున ఒక హదీథును – అది అబద్ధం అని తెలిసీ, లేక అబద్ధపు హదీసేమో అనే కొద్దిపాటి అనుమానం ఉన్నా; లేక ఇది ఖచ్చితంగా అబద్ధపు హదీథే అనే బలమైన అనుమానం ఉండి కూడా దానిని ప్రచారం చేసినట్లైతే అతడు వాస్తవానికి దానిని ప్రారంభించిన వానితో కలిసి ఈ అబద్ధములో పాల్గొంటున్న వాడు అవుతాడు.

فوائد الحديث

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించబడిన హదీసులను ముందుగా ధృవీకరించుకోవాలి, మరియు వాటిని ఉల్లేఖించడానికి ముందు, లేక వాటిని ప్రచారం చేయడానికి ముందు వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవాలి.

ఈ హదీథులో ఇవ్వబడిన అబద్ధాలకోరు యొక్క వర్ణన ఆ అబద్ధాన్ని ఉనికిలోనికి తెచ్చిన ప్రతి ఒక్కరికీ మరియు దానిని ప్రసారం చేసి ప్రజలలో వ్యాప్తి చేసే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

ఒక హదీథును అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరున కల్పించబడిన హదీథు అని తెలిసిన వారు ఎవరైనా, లేక అది కల్పించబడిన అబద్ధపు హదీథు అనే బలమైన అనుమానం ఉన్న వారు ఎవరైనా దానిని ఉల్లేఖించడం, దానిని ప్రచారం చేయడం, దానిని వ్యాప్తి చేయడం హరాం (నిషేధము); కేవలం అది అబద్ధపు హదీథు అని స్పష్టంగా ప్రజలకు తెలియజేయుట కొరకు తప్ప.

التصنيفات

సున్నత్ ప్రాముఖ్యత మరియు దాని స్థానం., దుర్గుణాలు