“నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”

“నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకాన్ని చుట్టి ఉన్న విషయాల గురించి వివరిస్తున్నారు. అవి, మనసు వాంఛించే మరియు కావాలని కోరుకునే, నిషేధించబడిన విషయాలు మరియు తాను విధిగా ఆచరించ వలసిన విషయాలను నిర్లక్ష్యం చేసి, వాటిని వదిలివేయడం వంటివి అని వివరిస్తున్నారు. ఎవరైతే తన చపల చిత్తాన్ని మరియు దాని వాంఛలను అనుసరిస్తాడో, అతడు నరకానికి పాతృడు అవుతాడు. మరియు స్వర్గము, మనసు (సాధారణంగా) ఇష్టపడని విషయాలతో – అంటే, ఉదాహరణకు, (షరియత్’లో) ఆదేశించబడిన విషయాల పట్ల సహనం కలిగి ఉండి, వాటిని నిరంతరం పట్టుదలతో ఆచరించుట, (షరియత్) నిషేధించిన విషయాలను త్యజించుట మరియు అలా త్యజించడం పట్ల సహనం వహించుట మొదలైన విషయాలతో ఆవరించబడి ఉన్నది. ఒకవేళ ఎవరైతే వీటిని ఎదుర్కోవడానికి మరియు వీటి పట్ల నిరంతరం కృషి చేయడానికి సిధ్ధపడతాడో, అతడు స్వర్గములో ప్రవేశించడానికి పాత్రుడు అవుతాడు.

فوائد الحديث

మనిషిలో వాంఛలు ఎక్కువై పోవడానికి, పెరిగిపోతూ ఉండడానికి ఉన్న కారణాలలో ఒకటి, మనసు వాటి పట్ల ఆకర్షిత మయ్యేటంత వరకు చెడును, నిషేధిత విషయాలను (అసహ్యకరమైన విషయాలను సైతం) షైతాను అత్యంత సుందరమైనవిగా, మంచివిగా చేసి అతడి ముందు ప్రస్తుత పరచడం.

ఇందులో, నిషిధ్ధ వాంఛల నుండి, నిషేధిత విషయాలనుండి దూరంగా ఉండాలనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే అవి నరకానికి దారి తీస్తాయి. అలాగే చెడు విషయాల పట్ల (వాటికి మనసు లొంగి పోకుండా) సహనం వహించమనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే అది స్వర్గానికి దారితీస్తుంది.

ఇందులో - చెడుకు వ్యతిరేకంగా తన స్వయంతో పోరాడుట, అల్లాహ్ యొక్క ఆరాధనలో నిరంతరం నిలకడగా ఉండుట, అలాగే చెడు విషయాలకు (నిషిధ్ధ విషయాలకు) దూరంగా ఉండుటపై మరియు కఠిన పరిస్థితులను ఎదుర్కొనుటపై సహనం వహించుట – మొదలైన విషయాల ఘనత ఉన్నది.

التصنيفات

స్వర్గము,నరకము యొక్క లక్షణాలు