“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ,…

“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ, శక్తివంతులుగా ఉన్న సమయంలోనూ, బలహీనులుగా ఉన్న సమయంలోనూ, మాపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భంలోనూ

ఉబాదహ్ బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ, శక్తివంతులుగా ఉన్న సమయంలోనూ, బలహీనులుగా ఉన్న సమయంలోనూ, మాపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భంలోనూ మేము వారి మాట వింటామని మరియు వారికి విధేయులుగా ఉంటామని (వారి ఆదేశపాలన చేస్తామని) మరియు (పాలకులు బాహాటంగా, విస్పష్టంగా అవిశ్వాసానికి పాల్బడితే తప్ప) అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా పోరాడము అని, మేము ఎక్కడ ఉన్నా, నిందలు మోపే వారి అపనిందలకు భయపడకుండా, ఎల్లవేళలా అల్లాహ్ కొరకు కేవలం సత్యాన్నే పలుకుతామని - మేము విధేయతా ప్రతిజ్ఞ చేసినాము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాల నుండి ఇలా ప్రతిజ్ఞ తీసుకున్నారు – తాము అధికారములో ఉన్నవారికి, పాలకులకు విధేయులుగా ఉంటామని, – కష్టకాలములోనూ, సుఖసమయములోనూ, పేదరికములోనూ, సంపన్నతలోనూ, వారి ఆదేశాలు తమ మనసుకు నచ్చినా, నచ్చక పోయినా, వారు ప్రజాధనాన్ని, పదవులను, హోదాలను లేక అలాంటి ఇతర విషయాలను తమ నియంత్రణలో ఉంచుకున్నా, వారి మాట వినుట మరియు వారికి విధేయులుగా ఉంటామని. ఇది ప్రతిఙ్ఞ చేసిన వారిపై విధి; వారికి (అధికారంలో ఉన్నవారికి, పాలకులకు) వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదు. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటులో ఉన్న రాజద్రోహం మరియు చెడు, వారు చేస్తున్న అన్యాయము మరియు చెడు కంటే మహా ఘోరమైనవి. అలాగే వారు ఎక్కడ ఉన్నా నిందలు మోపే వారి అపనిందలకు భయపడకుండా, కేవలం అల్లాహ్ కొరకు, ఎప్పుడూ సత్యమునే పలకాలని కూడా ప్రతిజ్ఞ తీసుకోబడినది.

فوائد الحديث

అధికారములో ఉన్న వారికి, పాలకులకు విధేయులుగా ఉండడం, వారి మాట వినడం యొక్క ఫలము ఏమిటంటే ముస్లిములందరూ ఒక్క మాటపై ఉండడం (ఐకమత్యం), మరియు ముస్లిం సమాజంలో విభేదాలను, వర్గాలుగా విడిపోవడాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది.

ఇందులో అధికారములో ఉన్న వారికి, పాలకులకు విధేయులుగా ఉండుట, వారి మాట వినుట విధి అని తెలుస్తున్నది – అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్బడే విషయాలలో తప్ప – కష్టకాలములోనూ, సౌకర్యవంతముగా ఉన్న పరిస్థితులలోనూ - వారు (పాలకులు) ప్రజాధనాన్ని, పదవులను, హోదాలను తమ కొరకు మాత్రమే ఉంచుకుని, గుత్తాధిపత్యం చెలాయిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నా సరే.

అలాగే ఇందులో (ఒక ముస్లిం) ఎక్కడ ఉన్నా, నిందలు మోపేవారి నిందలకు భయపడకుండా, అల్లాహ్ కొరకు సత్యమునే పలుకుట అతనిపై విధి అని తెలుస్తున్నది.

التصنيفات

ధర్మబద్దమైన విధానం, ఇమామ్ పై బయటకు వెళ్ళటం