“ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను…

“ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపు తున్నారు: ఎవరైతే, అల్లాహ్ కు ఏవిషయంలోనూ, ఎవరినీ మరియు దేనినీ ఆయనకు సాటి కల్పించని స్థితిలో చనిపోతారో, అటువంటి వారు తాము చేసిన తప్పులకు, పాపాలకు కొద్ది కాలం నరక శిక్ష అనుభవించినా, చివరికి వారి శాశ్వత గమ్యస్థానము స్వర్గమే. అదేవిధంగా, ఎవరైతే షిర్క్ నకు పాల్బడుతున్న స్థితిలో (అల్లాహ్ కు సాటి కల్పిస్తున్న స్థితిలో) చనిపోతారో వారు శాశ్వతంగా నరకంలో వేయబడతారు.

فوائد الحديث

తౌహీద్ యొక్క ఘనత ఏమిటంటే, అది శాశ్వత నరక వాసము నుండి విముక్తి చేసే ఒక మార్గము.

దాసునికి స్వర్గమూ మరియు నరకమూ బహు చేరువలో ఉన్నాయి. అతనికీ మరియు వాటికీ మధ్య ఏదీ లేదు కేవలం మరణం తప్ప.

‘షిర్క్’ – అది కొద్ది పాటిది అయినా ఎక్కువది అయినా, అది నరకాగ్నిలో పడవేస్తుంది. మరి నరకాగ్ని నుండి ముక్తి మార్గము కేవలం షిర్కు నుండి దూరంగా ఉండడమే.

ఆచరణలలో మాన్యత వాటి చివరిలో చేసే ఆచరణలే

التصنيفات

బహుదైవారాధన (షిర్క్), స్వర్గము,నరకము యొక్క లక్షణాలు