“ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్…

“ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు”

అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు”.

[దృఢమైనది] [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు - ఇతరులకు హాని కలిగించుట అనేది అది ఏ రూపంలో ఉన్నా, ప్రతి ఒక్కరూ తన స్వయం నుండి మరియు ఇతరుల నుండి దానిని దూరం చేయాలి. కనుక ఏ ఒక్కరు కూడా తన స్వయానికి హాని తలపెట్టు కొనుటకు అనుమతి లేదు. అలాగే ఇతరులకు హాని తలపెట్టుటకు అనుమతి లేదు. మరియు హానికి ప్రతీకారంగా తిరిగి హాని తలపెట్టడానికి అనుమతి లేదు, శిక్షలో భాగమైతే తప్ప. అది కూడా హద్దుమీరకుండా, ఉల్లంఘనలకు పాల్బడకుండా. ఎందుకంటే హాని, హాని ద్వారా తొలగించబడదు. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రజలకు హాని తలపెట్టే వానికి, (అల్లాహ్ తరఫు నుండి) హాని కలుగుతుందని, ప్రజలపట్ల కఠినంగా ఉండే వానికి (అల్లాహ్ తరఫు నుండి) కాఠిన్యమే లభిస్తుందని - హెచ్చరించినారు.

فوائد الحديث

చట్టప్రకారంగానైనా సరే, తలపెట్టబడిన దాని కంటే ఎక్కువ మోతాదులో ప్రతిచర్య చేయుట నిషేధించబడినది.

అల్లాహ్ తన దాసులను, తమకు హాని కలిగించే ఏ పనినీ చేయమని ఆదేశించలేదు.

ఎవరికైనా సరే హాని కలిగించడం మరియు దానికి ప్రతీకారం చేయడం నిషేధించబడినది – అది మాటల రూపంలో నైనా, చేతల రూపంలో నైనా లేక చేయ వలసిన పనిని చేయకుండా వదిలి వేయడం ద్వారా నైనా సరే.

‘ఎవరైతే హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు, మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు’ – అంటే దీని అర్థం, వారు చేసిన పనిని బట్టి దాని ప్రతిచర్య వివిధ రకాలుగా ఉంటుంది అని.

షరియత్ యొక్క నియమాలలో ఒకటి: ‘షరియత్ (ఎవరికైనా, దేనికైనా) హాని కలిగించడాన్ని అనుమతించదు మరియు హానికి ప్రతిగా హాని తలపెట్టడాన్ని ఖండిస్తుంది.

التصنيفات

సిద్ధాంతపరమైన మరియు ఛాందసవాద నియమాలు, సిద్ధాంతపరమైన మరియు ఛాందసవాద నియమాలు