“నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప

“నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప”. (అది విని) వారితో ఇలా అనడం జరిగింది “ఓ రసూలుల్లాహ్, ఎవరు నిరాకరిస్తారు?” దానికి వారు “ఎవరైతే నాకు విధేయత చూపుతారో (నన్ను అనుసరిస్తాడో) అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతాడో (నన్ను అనుసరించడో) నిశ్చయంగా అతడు నిరాకరించిన వాడు”.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ యొక్క ప్రతి వ్యక్తి స్వర్గములోనికి ప్రవేశిస్తాడని, కేవలం ఎవరైతే దూరంగా ఉండిపోతాడో అతడు తప్ప అని తెలియజేసారు. అక్కడ ఉన్న సహాబాలు రజియల్లాహు అన్హుమ్ “ఎవరు దూరంగా ఉండిపోతారు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరునికి విధేయత చూపుతాడో, అతడి ఆదేశ పాలన చేస్తాడో మరియు అతడిని అనుసరిస్తాడో, అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే ఆయనకు అవిధేయత చూపుతాడో, షరియత్ ను అనుసరించడో, అతడి అవిధేయత, దుష్కర్మల కారణంగా స్వర్గం లోనికి ప్రవేశించడానికి నిరాకరించబడతాడు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం, అల్లాహ్ కు విధేయత చూపడమని, ఆయనకు అవిధేయత చూపడం, అల్లాహ్ కు అవిధేయత చూపడంతో సమానమని తెలుస్తున్నది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం స్వర్గానికి దారి తీస్తుంది, ఆయనకు అవిధేయత చూపడం నరకానికి దారి తీస్తుంది.

ఇందులో ఉమ్మత్ లోని విధేయులైన విశ్వాసులందరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారనే శుభవార్త ఉన్నది, కేవలం ఎవరైతే అల్లాహ్ కు, ఆయన సందేశహరునికి అవిధేయులుగా ఉండే వారు తప్ప.

ఇందులో తన ఉమ్మత్ పట్ల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంవేదన, అనుకంప మరియు ఉమ్మత్’ను సాఫల్యవంతమైన జీవితం వైపునకు మార్గదర్శకత్వం చేయుట పట్ల వారి ఆసక్తి, ఆతృత కనిపిస్తున్నాయి.

التصنيفات

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం