ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు

ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఇలా పలికినారు "ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు".

[ప్రామాణికమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఏదైనా ఒక జాతివారిని అనుకరించే వారి గురించి వివరిస్తున్నారు. ఉదాహరణకు అవిశ్వాసుల సమూహాన్ని లేదా క్రైస్తవుల సమూహాన్ని (జాతిని) అనుకరించేవారు లేదా ధార్మికులైన ప్రజల సమూహాన్ని అనుకరించేవారు - ఇలా ఏదైనా ఒక జాతిని, సమూహాన్ని వారి లక్షణాలలో, వారి స్వభావం లో, వారి గుణాణాలలో లేక వారి విశ్వాసాలలో, వారి ఆరాధనా పధ్ధతులలో లేక వారి ఆచార వ్యవహారాలలో వారిని అనుకరించినట్లయితే - అలా అనుకరించిన వారు, అనుకరించబడిన జాతి లేక సమూహములోని వారు అవుతారు. ఎందుకంటే వారిని బాహ్యంగా అనుకరించడం, అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి దారితీస్తుంది. ఎవరినైనా ఏదైనా విషయం లో అనుకరించడం అనేది ఆ విషయం పట్ల మనలోని ప్రశంసాత్మక వైఖరి, హర్షాతిరేకము మొదలైన వాటి కారణంగా మొదలవుతుంది. అది ఆ విషయాలను ప్రేమించేందుకు, వాటి పట్ల భక్తి శ్రద్ధలకు, వాటిపై ఆధారపడుటకు దారి తీయవచ్చు. ఇంకా అది మన అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి, ఆరాధించడానికి దారి తీయవచ్చు. అల్లాహ్ క్షమించుగాక.

فوائد الحديث

ఇందులో అవిశ్వాసుల సమాజాన్ని, నీతిబాహ్యుల సమాజాన్ని అనుకరించడం పట్ల ఒక హెచ్చరిక ఉన్నది.

అలాగే ధర్మవర్తనులైన వారిని అనుకరించమని, ధర్మం విషయంలో వారి ఉదాహరణలను అనుసరించమని ఉద్బోధ ఉన్నది.

బాహ్యానుకరణ ఆ జాతి లేక సమూహం పట్ల ప్రేమను వారసత్వంగా వెంట తీసుకు వస్తుంది.

ఇందులోని హెచ్చరిక మరియు పాపము - ఒక వ్యక్తి ఏ స్థాయిలో (ఎంత లోతుగా) ఆ సమూహాన్ని లేక ఆ జాతిని అనుకరించినాడు లేక అనుకరిస్తున్నాడు అనే దానిని బట్టి అతడు పొందుతాడు.

వారికి మాత్రమే ప్రత్యేకమైన అవిశ్వాసుల ధర్మాన్ని, వారి ధార్మిక ఆచార వ్యవహారాలను అనుకరించడం నిషేధించబడింది. అయితే వారికి మాత్రమే ప్రత్యేకం కాని ఇతర విషయాలను అనుకరించడం, అనుసరించడం ఈ నిషేధం క్రిందకు రావు. ఉదాహరణకు చేతిపనుల వంటి వాటిని అనుకరించడం, నేర్చుకోవడం, వారి సాంకేతిక విషయాలను అనుకరించడం, నేర్చుకోవడం మొదలైనవి.

التصنيفات

నిషేధించబడిన అనురూప్యము (పోలిక), నిషేధించబడిన అనురూప్యము (పోలిక)