, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు

, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు

అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము మస్జిదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై సవారై వచ్చినాడు. అతడు మస్జిదు (ప్రాంగణము)లో తన ఒంటెను కూర్చొనేలా చేసి, దాని ముందరి కాళ్ళు కట్టివేసి, (మా వద్దకు వచ్చి) “మీలో ముహమ్మద్ ఎవరు?” అని ప్రశ్నించాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “ఇదిగో తెల్లని మేని ఛాయతో, చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నది ఆయనే” అన్నాము. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశ్యించి “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా!” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “చెప్పు, నీకు సమాధానం చెప్పడానికి నేనిక్కడే ఉన్నాను” అన్నారు. అపుడు అతడు “నిన్నొక విషయం అడుగుతాను. కఠినంగా ప్రశ్నిస్తాను. కనుక “కోపగించుకోకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నువ్వు ఏం అడగాలను కుంటున్నావో అడుగు” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, మరియు నీకంటే ముందు గడిచిపోయిన వారి ప్రభువు సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను – అల్లాహ్ నిన్ను సర్వ మానవాళి కొరకు (తన) సందేశహరునిగా పంపించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను “దినము రాత్రిలో (రాత్రింబవళ్ళలో) ఐదు సార్లు సలాహ్ (నమాజు) ఆచరించాలని నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ మనిషి తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను అడుగుతున్నాను, సంవత్సరం మొత్తములో (ఫలానా) ఈ నెలలో ఉపవాసాలు పాటించాలని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను, మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, దానిని మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు “నీవు ఏ సందేశముతో పంపబడినావో, నేను దానిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ‘జిమామ్ ఇబ్న్ సాలబా’, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: మస్జిదులో సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై వచ్చి, దానిని అక్కడే కూర్చొనేలా చేసి దానిని కట్టివేసాడు. అపుడు అతడు “మీలో ముహమ్మద్ ఎవరు?” అని అడిగాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య, తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “అదుగో, తెల్లని మేని ఛాయతో, చేరగిలబడి కూర్చొన్నది ఆయనే” అన్నాము. ఆ మనిషి ఆయనతో “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “నేను వింటున్నాను, అడుగు ఏం అడగాలను కుంటున్నావో, నేను సమాధానం ఇస్తాను” అన్నారు. అపుడు ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో “నేను నిన్ను ప్రశ్నిస్తాను. కఠినంగా ఉంటాను. కనుక ఏమీ భావించకు” అన్నాడు. అంటే: నాపై కోపం తెచ్చుకోకు, మరియు మనసులో కష్టం పెట్టుకోకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “అడుగు, ఏం అడగాలని అనుకుంటున్నావో” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, నీ కంటే ముందు గతించిన వారి ప్రభువు సాక్షిగా అడుగుతున్నాను; అల్లాహ్ నిన్ను (తన సందేశహరునిగా) ప్రజల వద్దకు పంపినాడా?” అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు “అల్లాహ్ ను సాక్షిగా పెట్టి ప్రశ్నిస్తున్నాను” – అంటే “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను” అని అర్థము – “ప్రతి దినము, రాత్రిలో ఐదు సార్లు సలాహ్ ఆచరించమని (నమాజు చదవమని) అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” అంటే అవి విధిగా ఆచరించవలసిన నమాజులు అన్నమాట. దానికి ఆయన “అల్లాహ్ సాక్షిగా అవును” అని జవాబిచ్చారు. అతడు తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను సంవత్సరము మొత్తములో, ఫలానా మాసములో ఉపవాసాలు పాటించమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” – అంటే అది రమదాన్ మాసము. ఆయన “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు తిరిగి “అల్లాహ్ సాక్షిగా ప్రశ్నిస్తున్నాను; మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” – అంటే అది జకాతు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అని సమాధానం ఇచ్చారు. వెంటనే జిమామ్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో తాను తన తెగ ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తానని అన్నాడు. తరువాత అతడు తనను తాను జిమామ్ ఇబ్న్ సాలబా, అని బనూ సాద్ బిన్ బక్ర్ తెగకు చెందిన వాడినని పరిచయం చేసుకున్నాడు.

فوائد الحديث

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిరాడంబరత తెలియు చున్నది. ఆ మనిషి అక్కడ ఉన్నవారిలో ప్రవక్త ఎవరో గుర్తించలేక పోయాడు.

అలాగే ఈ హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ప్రశ్నలు అడుగుతున్న వ్యక్తికి సమాధానం చెప్పే విధానం లో వారి ఉన్నతమైన వ్యక్తిత్వము, వారి దయ, కరుణ తెలుస్తున్నాయి. ఇస్లాం యొక్క ఆహ్వానాన్ని స్వీకరించడానికి, తగిన విధంగా మంచి సమాధానం ఇవ్వడం కూడా ఒక కారణమవుతుంది.

ఈ హదీసు ద్వారా – ఒక వ్యక్తిని గుర్తించడానికి అతని యొక్క గుర్తులను బట్టి అతడిని గురించి చెప్పడం, అతని గురించి తెలియ జేయడం ఉచితమే అని తెలుస్తున్నది . ఉదాహరణకు అతని శరీర ఛాయ తెలుపు అని, ఎరుపు అని, అతడు ఎత్తుగా ఉంటాడని లేక అతడు పొట్టిగా ఉంటాడని ఇంకా అలాగే ఇతర లక్షణాల వర్ణనల ద్వారా తెలియ జేయ వచ్చును, అయితే ఆ లక్షణాలు ఆ వ్యక్తి శరీరంలోని లోపాలు అయి ఉండరాదు. అలాగే అతడు వాటిని అసహ్యించుకునేవి అయి ఉండరాదు.

అలాగే ఈ హదీసులో అవిశ్వాసులు మస్జిదులోనికి ప్రవేశించవచ్చును అనడానికి నిదర్శనం మరియు అనుమతి ఉన్నది.

ఈ హదీసులో హజ్ ప్రస్తావన లేదు. బహుశా ఈ సంఘటన జరిగిన నాటికి హజ్ ఫర్జ్ (విధి ఆచరణగా) చేయబడి ఉండక పోవచ్చు.

ఇతరులకు ఇస్లాం సందేశాన్ని చేరవేసే విషయంలో, వారిని ఆహ్వానించే విషయంలో సహబాలు ఎప్పుడూ చురుకుగా ఉండేవారు. ఈ హదీథులో జిమామ్ ఇబ్న్ సాలబా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించిన వెంటనే, తన తెగ వారిని ఆహ్వానించడానికి ఆతురత పడడం మనం చూడవచ్చు.

التصنيفات

అల్లాహ్ అజ్జ వ జల్ల పట్ల విశ్వాసం., మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం, అల్లాహ్ వైపు పిలుపు, నమాజ్ యొక్క అనివార్యమవటం మరియు దాన్ని వదిలే వాడి ఆదేశము, జకాత్ అనివార్యము మరియు దాన్ని వదిలివేసే వాడి ఆదేశం