“ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన…

“ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”

అబీ సిర్మహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”.

[ప్రామాణికమైనది] [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా హాని కలుగ జేయరాదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ముస్లిం, తన తోటి సహోదర ముస్లింనకు. అతనికి సంబంధించిన ఏ విషయములోనైనా సరే, అతనికి హాని కలుగజేయరాదు. ఉదాహరణకు అతనికి వ్యక్తిగతంగా గానీ, అతని సంపదలో గానీ లేదా అతకి కుటుంబానికి గానీ హాని కలుగజేయరాదు. ఒకవేళ ఎవరైనా అలా చేసినట్లయితే, అల్లాహ్ వారి ఆచరణను బట్టి వారికి తగిన ప్రతిఫలాన్నిస్తాడు (శిక్షిస్తాడు).

فوائد الحديث

ఇందులో ఒక ముస్లింనకు హాని కలుగజేయుట లేక అతడిని కఠిన పరిస్థితులకు లోను చేయుట ‘హరాం’ (నిషేధము) అని తెలుస్తున్నది.

ఇందులో తన దాసుల తరఫున అల్లాహ్ యొక్క ప్రతీకారము తెలుస్తున్నది.

التصنيفات

స్నేహము,శతృత్వము యొక్క ఆదేశములు