“మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ…

“మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ సంఘీభావాన్ని ముక్కలు చేయాలనే, లేక మీ జమాఅత్ ను విడదీయాలనే తలంపుతో ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే – అతడిని చంపివేయండి.”

అర్ఫజహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ సంఘీభావాన్ని ముక్కలు చేయాలనే, లేక మీ జమాఅత్ ను విడదీయాలనే తలంపుతో ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే – అతడిని చంపివేయండి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒకవేళ ముస్లిములందరూ (తమ విషయాల కొరకు) ఒక పాలకుని / నాయకుని వద్ద జమ అయితే (నాయకునిగా ఎంచుకుంటే), మరియు అందరూ ఒక జమాఅత్ గా ఉంటే, ఎవరైనా వచ్చి (ఎంచుకున్న) నాయకుని అధికారాన్ని బలవంతంగా తీసుకొన దలిచితే (లాక్కొన దలిచితే), లేక ముస్లిముల జమాఅత్ ను ముక్కలుగా చేయజూస్తే – ముస్లిములపై విధి ఏమిటంటే - ముస్లిములందరూ అతడిని వారించాలి, (అవసరమైతే) అతడితో యుద్ధము చేయాలి. ఇది అటువంటి తిరుగుబాటుదారుని కీడును దూరం చేయుట కొరకు మరియు ముస్లిముల రక్తమును సంరక్షించుట కొరకు.

فوائد الحديث

ఈ హదీసులో ముస్లిముల నాయకుని పట్ల అవిధేయత లేకుండా అతడి మాటను వినుట మరియు అతడి ఆదేశాలను పాటించుట విధి అని, నాయకునికి / పాలకునికి అవిధేయత చూపుట నిషేధము అని తెలుస్తున్నది.

ఎవరైతే ముస్లిముల నాయకునికి (ఇమాముకు) వ్యతిరేకంగా మరియు ముస్లిముల జమాఅత్’కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడో – అతడి స్థితి, స్థాయి, గౌరవం మరియు వంశము ఎంత గొప్పవి అయినా అతడితో యుద్ధం చేయాలి.

ఇందులో ఐకమత్యము పట్ల ప్రోత్సాహం, వర్గాలుగా విడిపోవడం మరియు అసమ్మతి, విభేదాలు కలిగి ఉండరాదనే హితబోధలు ఉన్నాయి.

التصنيفات

ఇమామ్ పై బయటకు వెళ్ళటం