వ్యవహారాల ధర్మశాస్త్ర జ్ఞానం

వ్యవహారాల ధర్మశాస్త్ర జ్ఞానం

5- “బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”

12- ఎవరైనా తప్పుడు ప్రమాణం చేసి (అల్లాహ్ పేరుతో అసత్య ప్రమాణం చేసి) ఒక ముస్లింకు చెందిన హక్కును (ఆస్తిని, వస్తువును, హక్కును) కాజేస్తే, అల్లాహ్ అతడి కొరకు స్వర్గాన్ని నిషేధిస్తాడు, నరకాన్ని తప్పనిసరి చేస్తాడు." అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! అది చిన్నది అయినాా (తక్కువ విలువది అయినా)?" ప్రవక్త ﷺ ఇలా జవాబు ఇచ్చారు: "అది ఒక చిన్న మిస్వాక్ పంటి పుల్ల అయినా సరే

14- బంగారానికి బంగారం, వెండికి వెండి, గోధుమలకు గోధుమలు, జొన్నలకు జొన్నలు, ఖర్జూరాలకు ఖర్జూరాలు, ఉప్పుకు ఉప్పు — ఏదైనా ఒక రకము వస్తువుకు బదులుగా అదే రకము వస్తువు మార్పిడి చేసుకునేటప్పుడు, (ఇచ్చే దానికి మరియు పుచ్చుకునేదానికి) సరిసమాన పరిమాణంలో, ఆ మార్పిడి ప్రత్యక్ష్యంగా తక్షణమే జరగాలి. ఒకవేళ ఈ వస్తువులు వేర్వేరు రకాలకు చెందినవి అయితే, మీకు ఇష్టమైన విధంగా అమ్ముకోవచ్చు (ఉదాహరణకు బంగారాన్ని వెండితో మార్చుకోవడం), కానీ ఆ లావాదేవీ ప్రత్యక్షంగా తక్షణమే జరగాలి