దైవ ప్రవక్తలపై విశ్వాసం.

దైవ ప్రవక్తలపై విశ్వాసం.

3- “నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప*”. (అది విని) వారితో ఇలా అనడం జరిగింది “ఓ రసూలుల్లాహ్, ఎవరు నిరాకరిస్తారు?” దానికి వారు “ఎవరైతే నాకు విధేయత చూపుతారో (నన్ను అనుసరిస్తాడో) అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతాడో (నన్ను అనుసరించడో) నిశ్చయంగా అతడు నిరాకరించిన వాడు”.

4- “ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది*. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”

7- “నాకంటే ముందు ఎవరికీ ప్రసాదించబడని ఐదు (ప్రత్యేకతలు) నాకు ప్రసాదించబడినాయి*. నాకు ఒక నెల ప్రయాణం దూరం నుండి (శత్రువులలో) భయోత్పాతం ద్వారా విజయం ప్రసాదించబడింది; భూమి నాకు మస్జిదుగానూ మరియు శుద్ధి పొందే స్థలంగానూ చేయబడింది. కనుక నా ఉమ్మత్’కు చెందిన వ్యక్తి నమాజు సమయం అయినపుడు అతడు సమయానికి నమాజు ఆచరించాలి, యుద్ధములో గెలువబడిన సంపద (యుద్ధప్రాప్తి) నా కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది, నాకు పూర్వం ఎవరికీ అది ధర్మసమ్మతం కానప్పటికీ; (తీర్పు దినమునాడు) సిఫారసు చేసే అవకాశం నాకు ప్రసాదించబడింది; ప్రవక్తలు, సందేశహరులు ప్రత్యేకంగా తమ జాతివారి కొరకు మాత్రమే పంపబడేవారు, మరియు నేను ప్రజలందరి కొరకు (అల్లాహ్ యొక్క) సందేశహరునిగా పంపబడినాను.”

11- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది*. తరువాత మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. తరువాత వలస వెళ్ళమని (అల్లాహ్ చే) ఆదేశించబడినారు. ఆయన మదీనా కు వలస వెళ్ళినారు. అక్కడ పది సంవత్సరాలు గడిపినారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమవదించినారు”.

12- “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని దానిని కంఠస్థం చేసుకునేందుకు వ్రాసి ఉంచుకునే వాడిని. దానికి ఖురైషీయులు ఇలా అంటూ నన్ను వారించేవారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్నీ రాస్తున్నావా? ఆయన మానవమాత్రుడు, ఆయన కోపంలోనూ మాట్లాడుతారు, అలాగే సంతోషంలోనూ మాట్లాడుతారు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. (జరిగిన విషయాన్ని) తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రస్తావించినాను. అపుడు వారు తన చేతి వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “@రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”

13- "మీలో ఉత్తములు నా తరం వారు (సహాబాలు), తర్వాత వారిని అనుసరించే వారు (తాబియీన్), తర్వాత వారిని అనుసరించే వారు (అతబ్బ తాబియీన్)."* ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు తరాలను గురించి చెప్పారా లేక మూడు తరాలను గురించి చెప్పారా అనే విషయం నాకు స్పష్టంగా గుర్తు లేదు." ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మీ తర్వాత కొంతమంది ప్రజలు వస్తారు – వారు విశ్వసిస్తారు, కానీ నమ్మదగినవారు కారు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారిని సాక్షిగా అడగరు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారి మధ్య మోటుదనం (అధిక బరువు/సుఖ జీవనం) విస్తరించి, లావుగా ఉంటారు."