దావహ్ మరియు హసబహ్

దావహ్ మరియు హసబహ్

2- సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి దురాచరణల కారణంగా) వారిని ఇష్టపడకపోనూ వచ్చు. ఎవరైతే పాలకుని దురాచరణలను, దుర్మార్గాలను (అవి పునరావృతం కాకుండా ఉండాలని) అతని దృష్టికి తీసుకు వెళతాడో, (తీర్పు దినమున) అతడు తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. మరియు ఎవరైతే (పాలకుని దృష్టికి తీసుకు వెళ్ళేటంత శక్తి, ధైర్యము లేక) అతని దుర్మార్గాలను మనసులో అసహ్యించుకుంటాడో (తీర్పు దినమున) అతడు శాంతిని పొందుతాడు. అయితే ఎవరైతే పాలకుని దుర్మార్గాలను ఆమోదిస్తాడో, మరియు వాటిని తాను కూడా ఆచరిస్తాడో – తీర్పు దినము నాడు నాశనమై పోతాడు.”

4- “నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే

6- “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”

21- “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”