ధర్మ పద్దతులు

ధర్మ పద్దతులు

7- “నేను నా బాల్యములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకములో ఉంటిని. (భోజన సమయాన) నా చేయి భోజనపళ్ళెం అంతటా తిరుగుతూ ఉండేది. దాంతో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు “@ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను*.” అప్పటి నుండి నేను ఆ విధంగానే తింటున్నాను.”

11- “ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “@వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను*”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).

12- “మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి*; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: “మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”.

30- “ప్రతి రాత్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అరచేతులను దగ్గరకు చేర్చి, వాటిలో ఊది, అల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్, అన్’నాస్ సూరాలను (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను)* పఠించి, ఆ రెండు అరచేతులతో వీలైనంత మేర శరీర భాగాలను తుడుచుకునే వారు. తన తల, ముఖము, మరియు శరీరపు ముందు భాగము నుండి ప్రారంభించేవారు. అలా మూడు సార్లు చేసేవారు”.