దుఆలను,అజ్కార్ లను అర్ధం చేసుకోవటం

దుఆలను,అజ్కార్ లను అర్ధం చేసుకోవటం

3- “అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). అయితే ఇందులో మీరు దేనితోనైనా ప్రారంభించవచ్చు”

21- “రబ్బిఘ్’ఫిర్లీ ఖతీఅతీ వ జహ్లీ; వ ఇస్రాఫీ ఫీఅమ్రీ కుల్లిహి; వమా అన్త ఆలము బిహి మిన్నీ; అల్లాహుమ్మగ్’ఫిర్లీ ఖతాయాయ, వఅమ్’దీ, వ జహ్’లీ, వ హజ్’లీ, వ కుల్లు జాలిక ఇన్దీ; అల్లాహుమ్మగ్'ఫిర్’లీ మా ఖద్దంతు; వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్’తు, వమా ఆ’లన్’తు; అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅఖ్ఖిరు; వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్” (ఓ నా ప్రభూ! నా తప్పులను మన్నించు, నా వ్యవహారాలన్నింటిలో నేను అతిక్రమించిన ప్రతి విషయాన్ని మన్నించు, ఈ విషయాల గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా లేదా నా అఙ్ఞానం వలన లేదా నేను హాస్యంగా లేక అపహాస్యంగా చేసిన తప్పులన్నింటినీ మన్నించు మరియు నేను చేసే ప్రతి పనిలో నా తప్పులన్నింటినీ మన్నించు. ఓ అల్లాహ్! నా గత పాపాలను, నా భవిష్యత్తు పాపాలను, నా రహస్య పాపాలను, నా బహిరంగ పాపాలను క్షమించు. ఆది నీవే, అంతమూ నీవే, అన్ని విషయలపై అధికారం గలవాడవు నీవే)

25- “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)

29- “(ఓ అలీ!) నీవు ఇలా పలుకు “అల్లాహుమ్మహ్’దినీ వసద్దిద్’నీ” (ఓ అల్లాహ్! నాకు మార్గదర్శకం ప్రసాదించు మరియు నేను తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి), ఈ దుఆ చేయునపుడు నీవు మార్గదర్శకం కొరకు ప్రార్థిస్తున్నపుడు ఆయన చేత నీవు సరళ మార్గములో మార్గదర్శకం చేయబడుతున్నావు అని మనసులో భావించు. అలాగే తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి అని ప్రార్థిస్తున్నపుడు, ఎక్కుపెట్టబడిన బాణము సూటిగా లక్ష్యం ఛేదించడాన్ని మనసులో ఊహించుకో.”

34- “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

36- “మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”

37- “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”