పేర్లు మరియు ఆదేశాలు.

పేర్లు మరియు ఆదేశాలు.

12- “ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు* (అతడు ముస్లిం కాడు అని అర్థము). మరియు ఎవరైతే జోస్యుని దగ్గరకు వెళతాడో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తాడో – అలాంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని విశ్వసించ లేదు.”

17- “ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది*. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”

20- “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “@నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే)*, వీటిల్లో ఏ ఒక్క దానిలోనూ ఏమీ ఎక్కువ చేయకపోయినా (ఎక్కువ ఏమీ ఆచరించకపోయినా) నేను స్వర్గం లోనికి ప్రవేశించగలనా?” దానికి ఆయన “అవును, ప్రవేశించగలవు” అన్నారు. దానికి అతడు “అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే ఏ ఒక్క విషయమూ ఎక్కువ చేయను (ఎక్కువ ఆచరించను)” అన్నాడు.

21- “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి*, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.

25- “ఎవరైతే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి – ఆ మార్గాన్ని అనుసరించిన వారి పుణ్యమును పోలినంత పుణ్యము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పుణ్యములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు*. మరియు ఎవరైతే మార్గభ్రష్టత్వము వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి - దానిని అనుసరించిన వారి పాపములను పోలినంత పాపము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పాపములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు.

30- “నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని పాటించే శిష్యులు మరియు సహచరులు లేకుండా పంపబడలేదు*. వారు తమ తరువాత వచ్చిన వారితో తొలగించబడ్డారు. మరియు వారు (తరువాత వచ్చినవారు) చేయని పనులను గురించి మాట్లాడతారు మరియు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. ఎవరైతే వారితో తన చేతితో పోరాడుతాడో అతడు విశ్వాసి. ఎవరైతే వారితో తన నాలుకతో పోరాడుతాడో అతడు విశ్వాసి, మరియు ఎవరైతే వారితో తన హృదయంతో పోరాడుతాడొ అతడు విశ్వాసి. ఇక దీనికి మించి ఆవ గింజంత విశ్వాసం కూడా లేదు.”

31- “నజ్ద్ ప్రాంతపు ప్రజల నుండి చెదిరిన జుట్టుతో ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. అతను ఉచ్ఛ స్వరంతో మాట్లాడడం మేము వినగలుగుతున్నాము, కాని అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చే సరికి, అతను ఇస్లాం గురించి అడుగుతున్నాడని స్పష్టమైంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా చెప్పారు: “దినము మరియు రాత్రిలో (విధిగా ఆచరించవలసిన) ఐదు సలాహ్’లు (నమాజులు) ఉన్నాయి”; దానికి అతడు “ఇవి గాక ఇంకేమైనా (నమాజులు) నాపై ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప. అలాగే (విధిగా ఆచరించవలసిన) రమదాన్ మాసపు ఉపవాసాలున్నాయి” అన్నారు. అతడు “ఇవిగాక నాపై ఇంకేమైనా (ఉపవాసాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి జకాత్ గురించి తెలిపినారు. దానికి అతడు “ఇది గాక నాపై ఇంకేమైనా (దానాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలనుకుంటే తప్ప” అన్నారు. దానితో అతడు ఇలా అంటూ వెనుదిరిగినాడు “అల్లాహ్ సాక్షిగా, దీనిపై ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, దీని నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు @“అతను సత్యవంతుడైతే అతను విజయం సాధిస్తాడు.”

32- “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలికి, సలాహ్ ను స్థాపించి, జకాతు చెల్లించే వరకు* ప్రజలతో పోరాడమని నేను ఆఙ్ఞాపించబడినాను. ఒకవేళ వారు అలా చేస్తే వారు తమ రక్తాన్ని (ప్రాణాన్ని) మరియు తమ సంపదలను నా నుంచి రక్షించుకున్నట్లే; ఇస్లామీయ చట్టాల ద్వారా (మరణ శిక్ష విధించబడితే) తప్ప.”

33- “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఒక రోజు ఉదయం మేము ప్రయాణిస్తున్నపుడు, నేను వారికి దగ్గరగా ఉన్నాను. అపుడు నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం!, నన్ను స్వర్గంలోనికి ప్రవేశింపజేసే, మరియు నరకాగ్ని నుండి నన్ను దూరంగా ఉంచే ఒక ఆచరణను గురించి నాకు తెలియజేయండి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం*. కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు ఎవరినీ, దేనినీ సాటిగా నిలబెట్టకు, సలాహ్’ (నమజు) స్థాపించు, జకాత్ చెల్లించు, రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు మరియు అల్లాహ్ గృహం యొక్క (కాబతుల్లాహ్ యొక్క) హజ్ చేయి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇంకా ఇలా అన్నారు: "నేను నిన్ను శుభాల ద్వారముల వైపునకు మార్గదర్శకం చేయనా! ఉపవాసం ఒక కవచం, నీరు అగ్నిని ఆర్పినట్లు దాతృత్వం పాపాన్ని ఆర్పివేస్తుంది అలాగే రాత్రి సగభాగములో మనిషి ఆచరించే సలాహ్". తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “{تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} నుండి మొదలుకుని {يَعْمَلُونَ} వరకు (సూరహ్ అస్’సజ్దహ్ 16-17). తరువాత ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు, ఈ మొత్తం విషయం యొక్క మూల స్థంభము మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను: “తప్పకుండా ఓ రసూలల్లాహ్! నాకు తెలియజేయండి” అన్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి శిరస్సు ఇస్లాం, దాని మూలస్థంభము సలాహ్ మరియు దాని శిఖరం జిహాద్." తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “వీటన్నింటినీ పట్టి ఉంచేది ఏమిటో తెలుపనా?” దానికి నేను “తప్పకుండా తెలపండి ఓ ప్రవక్తా!” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని “దీనిని నియంత్రణలో ఉంచుకో” అన్నారు. నేను “ఓ అల్లాహ్ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మాట్లాడే మాటలకు మనం జవాబుదారీగా ఉంటామా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను, ఓ ముఆద్! నాలుకలు పండించే పంట తప్ప మనుషులను వారి ముఖాల మీదనో లేదా వారి ముక్కు మీదనో నరకాగ్నిలో పడవేసేది ఏదైనా ఉందా?”

41- “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను “ఓ రసూలుల్లాహ్! ఇబ్నె జుదాన్ బంధాలను, బాంధవ్యాలను గౌరవించేవాడు, వాటిని నిలిపి ఉంచేవాడు, కొనసాగించేవాడు, మరియు (ఇస్లాం కు పూర్వపు) అఙ్ఞాన కాలములో పేదవారికి అన్నం తినిపించేవాడు. ఇది (ఈ మంచిపనులు) అతనికి ఏమైనా ప్రయోజనాన్ని కలుగజేస్తుందా?” దానికి ఆయన “ఇది అతనికి ఏమీ ప్రయోజనం కలుగజేయదు, @ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు.

46- “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అఙ్ఞానపు కాలములో (ఇస్లాం స్వీకరించక ముందు కాలములో) పేదవారికి దానము చేయుట, బానిసలకు విముక్తి కలిగించుట, బంధువులను ఆదరించుట, వారితో బంధుత్వాలను కొనసాగించుట మొదలైన మంచిపనులు చేస్తూ ఉండేవాడిని. మరి నాకు ఆ మంచిపనుల ప్రతిఫలం లభిస్తుందా?” దానికి ఆయన “@నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు.

50- “సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది*. తరువాత అంతే కాలము కొరకు (40 దినముల కొరకు) అతడు ఒక రక్తపు ముద్దలా అవుతాడు. తరువాత అతడు అంతే కాలం కొరకు ఒక మాంసపు ముద్దలా అవుతాడు. అపుడు (అల్లాహ్ తరఫున) ఒక దైవదూత అతని వద్దకు పంపబడతాడు. అతడు నాలుగు విషయాలు రాయుట కొరకు ఆఙ్ఞాపించ బడతాడు; అతడి జీవనోపాధి, అతని జీవనకాలము (అతడు ఎంత కాలం జీవిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు), అతడి ఆచరణలు మరియు అతడు చెడ్డవాడా లేక ధన్యజీవియా అనే విషయాలు. అపుడు అతని లోనికి ఆత్మ ఊదబడుతుంది. మీలో ఎవరైనా స్వర్గవాసుల లక్షణమైన సత్కార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు. అలాగే మీలో ఎవరైనా నరకవాసుల లక్షణమైన పాపకార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు దాని లోనికి ప్రవేశిస్తాడు.