ఫిఖ్ మరియు దాని నియమాలు - الصفحة 3

ఫిఖ్ మరియు దాని నియమాలు - الصفحة 3

8- రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నమాజ్ (సలాహ్) చేసినాడు. ఆ పిదప అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "@నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ ను సరిగ్గా చేయలేదు."* అతను తిరిగి వెళ్లి మళ్లీ అదే విధంగా నమాజ్ చేసినాడు. ఆ తరువాత వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో మళ్లీ అలాగే చెప్పినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ సరిగ్గా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. ఇక ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ముల్ని సత్యంతో పంపినవాడిపై ప్రమాణం చేస్తూ చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా నమాజు చేయలేను. కాబట్టి, దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్‌ కొరకు నిలబడినప్పుడు మొట్టమొదట తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పు. తర్వాత నీకు సాధ్యమైనంత ఖుర్ఆన్ చదువు. ఆ తరువాత రుకూలోనికి వెళ్లి, రుకూలో పూర్తిగా ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళు, సజ్దాలో ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత కూర్చో, కూర్చోవడంలో ప్రశాంతంగా ఉండు. నీ నమాజ్ మొత్తం ఇలాగే చేయి."

9- "ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది*; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."

11- "ఓ అబా సయీద్! ఎవరైతే అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా సంతృప్తి చెందుతారో, వారికి స్వర్గం హామీ ఇవ్వబడుతుంది."* అబూ సయీద్ దానితో ఆశ్చర్యపోయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: ఓ రసూలల్లాహ్! దానిని నా కొరకు పునరావృతం చేయండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలా పునరావృతం చేసి, ఇంకా ఇలా పలికినారు: "స్వర్గంలో దాసుడి స్థానాన్ని వంద స్థాయిలు పెంచే మరొక విషయం కూడా ఉంది; ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం భూమ్యాకాశాల మధ్య దూరమంత ఉంటుంది." అపుడు అతను ఇలా అడిగినారు: "ఓ రసూలల్లాహ్! అది ఏమిటి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ కొరకు ధర్మపోరాటం, అల్లాహ్ కొరకు ధర్మపోరాటం."

14- “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య ఉన్నప్పుడు, మేము మాలోని ప్రతి చిన్నవారి తరఫున, ప్రతి పెద్దవారి తరఫున, యువకుల తరఫున, వృద్ధుల తరఫున, స్వేచ్ఛా బానిసల తరఫున, ఒక సా' ఆహారం, లేదా ఒక సా' వెన్న, లేదా ఒక సా' బార్లీ, లేదా ఒక సా' ఖర్జూరం, లేదా ఒక సా' ఎండుద్రాక్ష, జకాతుల్ ఫితర్’గా ఇచ్చేవాళ్ళం*. ముఆవియా ఇబ్న్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హుమా) హజ్జ్ నుండో ఉమ్రా నుండో తిరిగి వచ్చేంత వరకు మేము జకాతుల్ ఫిత్ర్ ఈ విధంగా తీయడం ఆపలేదు (అంటే ఈ విధంగానే జకాతుల్ ఫిత్ర్ ఇస్తూ వచ్చాము). ఆయన మెంబర్ పైకి ఎక్కి ప్రజలను సంబోధించి ఇలా అన్నారు: “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను”. ప్రజలు దానిని అంగీకరించారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (ర) ఇంకా ఇలా అన్నారు: “కానీ నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం ఆ విధంగానే జకాతుల్ ఫిత్ర్ తీస్తాను, ఏ విధంగానైతే నేను (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న కాలం నుండి) ఇప్పటి వరకూ తీస్తూ వచ్చినానో.”

27- అబూ మూసా తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు, అతని తల అతని కుటుంబంలోని ఒక మహిళ ఒడిలో ఉండగా అతను స్పృహ కోల్పోయారు. మరియు అతను ఆమెకు ఏ విధంగానూ (ఆమె పెడబొబ్బలకు నిస్పృహ వలన) స్పందించలేకపోయారు. స్పృహ తిరిగి వచ్చిన తర్వాత, అతను ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి నుండి అయితే తనను తాను వేరు చేసుకున్నారో, వారి నుండి నన్ను నేను వేరు చేసుకుంటున్నాను. @నిశ్చయంగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, సాలిఖా (జనాజాపై పెద్దగా పెడబొబ్బలు పెడుతూ విలపించే స్త్రీ), హాలిఖా (తలజుట్టు గొరిగించుకునే స్త్రీ) మరియు షక్కా (దుఃఖంలో దుస్తులు చింపుకునే స్త్రీ) లను తిరస్కరించారు.

35- తన తల్లి బింతె రవాహా తన తండ్రిని తన సంపదలో కొంత భాగాన్ని అతని కొడుకుకు బహుమతిగా ఇవ్వమని అడిగింది. అతను ఒక సంవత్సరం పాటు సంకోచించాడు, కానీ ఆ తరువాత అతను నిర్ణయించుకున్నాడు. దానికి ఆమె ఇలా అంది: "నీవు నా కొడుకుకు ఇచ్చిన దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా ఉంచే వరకు నేను సంతృప్తి చెందను. అపుడు, నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, ఆ సమయంలో నేను చిన్నవాడిని, మరియు అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకుని వెళ్ళి, ఇలా పలికినాడు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి బింత్ రవాహా, నేను తన కొడుకుకు బహుమతిగా ఇచ్చిన దానికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నది." దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారా?" దానికి అతను "అవును" అని అనగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "నీవు వారందరికీ ఇదే బహుమతి ఇచ్చావా?" అతను "లేదు" అని సమాధానమిచ్చినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @"అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి సాక్ష్యమివ్వను."* మరియు ముస్లిం హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన పదాలలో ఇలా ఉన్నది: "అప్పుడు నన్ను కాదు, మరొకరిని దానికి సాక్షిగా ఉంచు."

40- "ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు*. వారు ముందుగా మస్జిద్‌కు రావడంలో (తహ్జీర్) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. వారు ఇషా (రాత్రి నమాజ్) మరియు ఫజర్ (ఉదయం నమాజ్) లో ఉన్న ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, ఎంత కష్టమైనా, నడవలేకపోయినా, కదలలేకపోయినా, చాలా కష్టంగా అయినా, చేతుల మీద నడుస్తూ రావలసి వచ్చినా, ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు."

41- "నేను అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఇంట్లో వారికి పానీయాలు పోసేవాడిని. ఆ కాలంలో వారు ఖర్బూజా లేదా ఖజూర్ పండ్లతో తయారైన 'ఫదీఖ్' అనే మద్యపానీయం త్రాగుతుండే వారు. ఒక రోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక ప్రకటనకారుణ్ని పంపి ఇలా ప్రకటన చేయించినారు:@ 'జాగ్రత్తగా వినండి! మద్యం ఇప్పుడు నిషేధించబడింది.'* అది వినగానే అబూ తల్హా (రదియల్లాహు అన్హు) నన్ను చూసి ఇలా అన్నారు: 'బయటకి వెళ్లి దీన్ని పారేయ్.' నేను దాన్ని బయటకు తీసువెళ్ళి పారేశాను. అది మదీనా వీధుల్లో ప్రవహించింది." ఆ సమయంలో కొంతమంది ప్రజలు ఇలా ప్రశ్నించారు: 'కొంతమంది మద్యం తాగిన స్థితిలో చనిపోయారు. ఇప్పుడు నిషేధం వచ్చేసరికి అది వాళ్ల కడుపుల్లోనే ఉంది. మరి వారి సంగతి ఏమిటి?' అప్పుడు అల్లాహ్ నుండి ఈ వాక్కు అవతరించింది: "ఓ విశ్వాసులారా! విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు — వారు ఇంతకు ముందు తిన్న వాటి పట్ల (నిషేధం రాకముందు) ఏ పాపమూ ఉండదు - అల్లాహ్‌కు భయపడుతూ, విశ్వసిస్తూ, మంచి కార్యాలు చేస్తూ ఉండినంతవరకూ…" (సూరతుల్ మాయిదా 5:93)

43- "ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ* ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"