సద్గుణాలు మరియు పద్దతులు - الصفحة 3

సద్గుణాలు మరియు పద్దతులు - الصفحة 3

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో, ఎవరైతే మాకు ఖుర్’ఆన్ పారాయణము చేసినారో (ఎవరి వద్దనైతే మేము ఖుర్’ఆన్ నేర్చుకున్నామో) – వారు మాతో ఇలా పలికినారు – @తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు*. వారు ఇంకా ఇలా అన్నారు – “ఆ విధంగా మేము ఙ్ఞానాన్ని, మరియు దాని అన్వయాన్ని కూడా నేర్చుకున్నాము”.

3- “ప్రతి రాత్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అరచేతులను దగ్గరకు చేర్చి, వాటిలో ఊది, అల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్, అన్’నాస్ సూరాలను (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను)* పఠించి, ఆ రెండు అరచేతులతో వీలైనంత మేర శరీర భాగాలను తుడుచుకునే వారు. తన తల, ముఖము, మరియు శరీరపు ముందు భాగము నుండి ప్రారంభించేవారు. అలా మూడు సార్లు చేసేవారు”.

5- “ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు*”, తరువాత ఆయన (అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఈ ఆయతును పఠించినారు: {وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ} [آل عمران: 135] {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుద్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలి ఇమ్రాన్: 3:135]

6- “ఒక మనిషి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురుగా కూర్చుని ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్ ! సల్లల్లాహు అలైహి వసల్లం నా దగ్గ ఇద్దరు బానిసలు ఉన్నారు. వారు నాతో అబద్ధాలు ఆడతారు, నన్ను మోసం చేస్తారు, మరియు నా పట్ల అవిధేయతతో ప్రవర్తిస్తారు. అందుకని నేను వారిని తిట్టే వాడిని, కొట్టే వాడిని. మరి వారికి సంబంధించి (తీర్పు దినమున) నా విషయము ఏమిటి (ఏమి కానున్నది)? దానికి ఆయన ఇలా అన్నారు: “@ నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి*. నీ శిక్ష మరియు వారి పాపాలు సమానంగా ఉంటే, ఇద్దరూ సమానంగా పరిగణించబడతారు. అందులో నీ కొరకు ఏమీ లేదు వారికి వ్యతిరేకంగా కూడా ఏమీ ఉండదు. అలాగే నీ శిక్ష వారి పాపాల కంటే ఎక్కువ మోతాదులో ఉంటే, నీ పుణ్యాలలో నుండి కొన్నింటిని నీ నుండి తీసుకుని వారికి ఇవ్వబడతాయి. ఆ మనిషి అక్కడి నుండి లేచి (బయటకు) వెళ్ళిపోయాడు. అక్కడ గట్టిగా ఏడవసాగాడు, దు:ఖించసాగాడు. అది చూసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో “అల్లాహ్ తన దివ్య గ్రంథములో (ఖుర్’ఆన్ లో) ఏమని అంటున్నాడో నీవు చదవాలి {మరియు పునరుత్థానదినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్కచూడటానికి మేమే చాలు!} (సూరాహ్ అల్ అంబియా 21:47). అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారి నుంచి విడిపోవడమే వారిద్దరికీ మరియు నాకూ మంచి చేకూర్చే విషయం. మీరు సాక్ష్యంగా ఉండండి ఆ ఇద్దరు బానిసలను విముక్తి చేస్తున్నాను. ఇక నుండి వారిద్దరూ స్వతంత్రులు”.

8- “అప్పుడు, ఆ రోజు మీరు, @(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)* (సూరహ్: అత్-తకాథుర్ 102:8) అనే ఆయతు అవతరించినపుడు, జుబైర్ (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా పలికారు “ఓ రసూలుల్లాహ్! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది? మన వద్దనున్న రెండు నల్లని విషయాలు, ఖర్జూరాలు, నీళ్ళు; వాటి గురించా?” అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు “అవి తప్పనిసరిగా ఉంటాయి.”

9- “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)* ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”

10- “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”

12- “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ప్రతిఫలం మరియు కీర్తి కోసం యుద్ధానికి వెళ్ళే వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను ఏమి పొందుతాడు?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతని కొరకు ఏమీ లేదు” అన్నారు. అతడు అదే ప్రశ్నను మూడు సార్లు అడిగాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లూ “అతని కొరకు ఏమీ లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”.