సద్గుణాలు మరియు పద్దతులు - الصفحة 2

సద్గుణాలు మరియు పద్దతులు - الصفحة 2

6- “మీలో ఎవరైనా (నిద్రలో) ఏదైనా కల చూసినట్లయితే, మరియు ఒకవేళ అది మీకు ఇష్టమైన కల అయినట్లయితే, అది అల్లాహ్ తరఫు నుంచి (అని భావించాలి); అందుకు మీరు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి, ఆయన ఘనతను కొనియాడాలి మరియు ఇతరులకు తెలియజేయాలి. మరి ఒకవేళ మీకు వచ్చిన కలను మీరు ఇష్టపడనట్లయితే, అది షైతాను తరఫు నుంచి (అని భావించాలి), అందుకు మీరు అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దానిని ఇతరులకు తెలియజేయకూడదు. ఎందుకంటే అది మీకు ఎలాంటి హానీ కలుగజేయదు.”

11- “మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”

12- అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు

15- “శకునములను విశ్వసించుట ‘షిర్క్’ (బహుదైవారాధన); శకునములను విశ్వసించుట ‘షిర్క్’; శకునములను విశ్వసించుట ‘షిర్క్’ అని మూడు సార్లు అన్నారు. మరియు మనలో ప్రతి ఒక్కరూ దానిని ఎంతో కొంత అనుభవించిన వారమే; అయితే సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తనపై ఉంచిన భరోసా ద్వారా దానిని తొలగిస్తాడు.”

27- “వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు

56- “రబ్బిఘ్’ఫిర్లీ ఖతీఅతీ వ జహ్లీ; వ ఇస్రాఫీ ఫీఅమ్రీ కుల్లిహి; వమా అన్త ఆలము బిహి మిన్నీ; అల్లాహుమ్మగ్’ఫిర్లీ ఖతాయాయ, వఅమ్’దీ, వ జహ్’లీ, వ హజ్’లీ, వ కుల్లు జాలిక ఇన్దీ; అల్లాహుమ్మగ్'ఫిర్’లీ మా ఖద్దంతు; వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్’తు, వమా ఆ’లన్’తు; అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅఖ్ఖిరు; వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్” (ఓ నా ప్రభూ! నా తప్పులను మన్నించు, నా వ్యవహారాలన్నింటిలో నేను అతిక్రమించిన ప్రతి విషయాన్ని మన్నించు, ఈ విషయాల గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా లేదా నా అఙ్ఞానం వలన లేదా నేను హాస్యంగా లేక అపహాస్యంగా చేసిన తప్పులన్నింటినీ మన్నించు మరియు నేను చేసే ప్రతి పనిలో నా తప్పులన్నింటినీ మన్నించు. ఓ అల్లాహ్! నా గత పాపాలను, నా భవిష్యత్తు పాపాలను, నా రహస్య పాపాలను, నా బహిరంగ పాపాలను క్షమించు. ఆది నీవే, అంతమూ నీవే, అన్ని విషయలపై అధికారం గలవాడవు నీవే)

59- “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక, వతహవ్వులి ఆ’ఫియతిక, వ ఫుజాఅతి నిఖ్’మతిక, వజమీఅ సఖతిక” (ఓ అల్లాహ్! (నా నుండి) నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి, మరియు (నాకు నీవు ప్రసాదించిన) సౌఖ్యము, క్షేమము మార్చివేయబడుట నుండి, మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చిపడే విపత్తు నుండి, మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.)

60- “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)

63- “(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్” (ఓ అల్లాహ్! మా ప్రభువా! ఈ ప్రపంచములో మాకు మంచిని కలుగజేయుము, మరియు పరలోకమునందును మాకు మంచిని కలుగజేయుము, మరియు నరకాగ్ని నుండి మమ్ములను రక్షింపుము.”

68- “(ఓ అలీ!) నీవు ఇలా పలుకు “అల్లాహుమ్మహ్’దినీ వసద్దిద్’నీ” (ఓ అల్లాహ్! నాకు మార్గదర్శకం ప్రసాదించు మరియు నేను తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి), ఈ దుఆ చేయునపుడు నీవు మార్గదర్శకం కొరకు ప్రార్థిస్తున్నపుడు ఆయన చేత నీవు సరళ మార్గములో మార్గదర్శకం చేయబడుతున్నావు అని మనసులో భావించు. అలాగే తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి అని ప్రార్థిస్తున్నపుడు, ఎక్కుపెట్టబడిన బాణము సూటిగా లక్ష్యం ఛేదించడాన్ని మనసులో ఊహించుకో.”

73- “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

79- “పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?

84- “ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”

89- ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! చిన్న పాపము, పెద్ద పాపము అనే భేదం లేకుండా నేను చేయని పాపపు పని లేదు (మరి నేను క్షమించబడతానా?); దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని నీవు సాక్ష్యం పలుకలేదా?”

90- “మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”

92- “ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”