అఖీద - الصفحة 2

అఖీద - الصفحة 2

3- “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని

20- “పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?

27- “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది

34- (ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు

36- “మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”

41- “ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”