ఆరాధనల ధర్మశాస్త్ర జ్ఞానం

ఆరాధనల ధర్మశాస్త్ర జ్ఞానం

33- నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే)

61- “నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి

62- అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు

74- “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

75- “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”

81- “ఎవరైతే (ప్రతిరోజూ విధిగా ఆచరించ వలసిన) ప్రతి నమాజు తరువాత ముప్ఫై మూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్’హందులిల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని ఉచ్ఛరిస్తాడో, అవి మొత్తం తొంభైతొమ్మిది అవుతాయి”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” అని ఉచ్ఛరించి మొత్తం వందగా పూర్తి చేస్తాడో, అతని పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అవి సముద్రపు నురగ అంత అధికంగా ఉన్నా సరే.”