ఫిఖ్ మరియు దాని నియమాలు
29- “లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “@ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”
40- “నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు క్షమాభిక్ష కోరుకునేవారు. తరువాత ఇలా పలికేవారు “@అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్*” (ఓ అల్లాహ్! నీవు సంపూర్ణ శాంతివి, శాంతి, ప్రశాంతత అన్నీ నీ నుంచే; శుభాలన్నీ నీ కొరకే, ప్రతి శుభమూ నీ నుంచే; మహోన్నత, పరమ పవిత్రత, ఠీవి, వైభవము, తేజస్సు గలవాడా; మరియు కీర్తి, గౌరవం, ఘనత గలవాడా). అల్-వలీద్ ఇలా అన్నారు: “నేను అల్-ఔజాయీ ని ‘అల్ ఇస్తిగ్’ఫార్’ అంటే ఎలా అడగాలి?” అని ప్రశ్నించాను. దానికి ఆయన “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్” అని పలుకు” అన్నారు.” (అస్తగ్ఫిరుల్లాహ్: నేను అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుతున్నాను)
44- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు*. “ఇన్నల్ హంద లిల్లాహి, నస్తయీనుహు, వ నస్తఘ్’ఫిరుహు, వ నఊజుబిహి మిన్ షురూరి అన్’ఫుసినా, మయ్యహ్’దిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్’లిల్ ఫలా హాదియలహు, వ అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. {యాఅయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్, వ ఖలఖ మిన్’హా జౌజహా, వ బస్స మిన్’హుమా రిజాలన్ కసీరన్, వ నిసాఅన్, వత్తఖుల్లాహల్లజీ తసాఅలూనబిహి, వల్ అర్హామ్, ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా}[సూరహ్ అన్ నిసా:1]; {యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతు ఖాతిహి, వలా తమూతున్న ఇల్లా వ అన్’తుమ్ ముస్లిమూన్.} [సూరహ్ ఆలి ఇమ్రాన్:102]; {యా అయుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ, వఖూలూ ఖౌలన్ సదీదన్}; {“యుస్’లిహ్’లకుం ఆ’మాలకుం, వ యఘ్’ఫిర్’లకుం, జునూబకుం, వమన్’యుతిఇల్లాహ వ రస్సులహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా} [అల్ అహ్’జాబ్ 70, 71]
(నిశ్చయంగా సకలస్తోత్రములూ, మరియు ప్రశంసలన్నియూ కేవలం అల్లాహ్ కొరకే, మేము అయనను మాత్రమే సహాయం కొరకు వేడుకుంటాము, మరియు మమ్ములను క్షమించమని ఆయను మాత్రమే వేడుకుంటాము, మాలోని కీడు నుండి ఆయన రక్షణ కోరుకుంటాము, ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడో, అతడిని ఎవరూ మార్గభ్రష్ఠుడిని చేయలేరు, మరియు ఎవరినైతే ఆయన మార్గభ్రష్ఠత్వములో వదిలివేసినాడో, ఎవరూ అతనికి సన్మార్గ దర్శకం చేయలేరు. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవరూ లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడని మరియు ఆయన సందేశహరుడనీ నేను సాక్ష్యమిస్తున్నాను. {ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా (పేరుతో) నైతే మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు} [సూరతున్’నిసా 4:1]; { ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి} [సూరతుల్ ఆలి ఇమ్రాన్ 3:102]; {ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి; ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు} [సూరతుల్ అహ్’జాబ్ 30:70,71]
52- “ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో*, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”
74- “నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు*; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”.
(కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”
75- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “@అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి*”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి).
సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).